Suryaa.co.in

Andhra Pradesh

బాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు

– జగన్‌ను ఇంటికి పంపించడం ప్రతి ఒక్క ఆంధ్రుడి బాధ్యత
– గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత, బలోపేతంతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఏజెండా “భవిష్యత్తు గ్యారెంటీ” మ్యానిఫెస్టో గురించి ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలను చైతన్యవంతం చేసి, 2024లో టిడిపి అధికారంలోకి వచ్చాక “భవిష్యత్తుకు గ్యారెంటీ” లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

ప్రతి ఒక్కరూ “భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలంటే నమోదు చేయించుకోవాలని, గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు, పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి “భవిష్యత్తు గ్యారెంటీ” మ్యానిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి, 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని యరపతినేని కోరారు.

నారా చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరుతూ, రానున్న 5 సంవత్సరాలలో టిడిపి ప్రకటించిన “భవిష్యత్తుకు గ్యారెంటీ” లోని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎంత ఆదాయం అందబోతుందో ప్రతి ఒక్కరికి వివరించి, “భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు గ్యారెంటీ” కార్యక్రమంలో నమోదు చేయించి, గ్యారెంటీ కార్డును ఆయా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

భవిష్యత్తు గ్యారెంటీ మ్యానిఫెస్టో :

మహాశక్తి పథకం :

* 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు రూ.1500 లు.
* “తల్లికి వందనం” పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 లు
* “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం.
* “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి “యువగళం నిధి” కింద నెలకు రూ. 3,000 లు.

“అన్నదాత పథకం” కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 ల ఆర్థిక సహాయం.
బీసీలకు రక్షణ చట్టం తెచ్చి… వారికి అన్ని విధాల అండగా నిలుస్తాము.
ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు. పేదలను సంపన్నులను చేస్తాము.

ఈ కార్యక్రమంలో జానపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు పిడుగురాళ్ల మండలం మరియు పిడుగురాళ్ల టౌన్ లోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల/టౌన్, గ్రామ/వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొనడం జరిగింది.

 

LEAVE A RESPONSE