లోకేశ్ మాటకే భయపడుతున్న ఈ ముఖ్యమంత్రి ఎంతపిరికివాడో అర్థమైంది : కాలవ శ్రీనివాసులు.
“ప్రజలతోమమేకం కావడానికి ఎందరో నిర్వహించిన పాదయాత్రల్లో, నారాలోకేశ్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. యువగళం యాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఓటమిభయంతో చేస్తున్న ప్రయత్నాలు, కుట్రలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి, సజ్జల ఆదేశాల తోనే పోలీసులు పాదయాత్రకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. చివరికి లోకేశ్ స్టూల్ పై నిలబడి మాట్లాడటానికి కూడా జగన్ ఒప్పుకోలేదు. లోకేశ్ యువగళంలో స్టూల్ పై నిలబడితే, తాడేపల్లిలోని జగన్ స్టూల్ (కుర్చీ) కంపిస్తోంది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగధర్మాల్ని కాలరాస్తుంటే, కేంద్రప్రభుత్వం ఎందుకు స్పందించదు?
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబుగారు భారీబందోబస్త్ కల్పించా రు. పోలీసులతో పాటు, ఎమ్మార్వోలు, ఆర్డీవోలు కూడా ఆనాడు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. కానీ నేడు జగన్ తన సైకోయిజంతో అడుగడుగునా లోకేశ్ ను అడ్డుకుం టున్నాడు. మేం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని లోకేశ్ పాదయాత్రకు బందోబస్త్ కూడా కోరడంలేదు. కానీ పాదయాత్ర అడ్డుకోవడం తప్పని చెబుతున్నాం. లోకేశ్ ను అడ్డుకుంటున్న జగన్ ఎంతపిరికివాడో, దద్దమ్మో అర్థమవుతోంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1)(బీ) ప్రకారం ప్రజలు శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహిం చుకోవచ్చని చెబుతోంది. స్వాతంత్ర్యం రాకముందునుంచి దేశంలో సభలు, సమావేశా లు, పాదయాత్రలు జరుగుతున్నాయి. దేశంలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అడుగడుగునా రాజ్యాంగధర్మాల్ని ప్రభుత్వం అడ్డుకుంటుంటే, కేంద్రప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం సబబుకాదు. రాజ్యాంగధర్మాల్ని కాపాడాల్సిన ఐపీఎస్, ఐఏఎస్ వ్యవస్థ లు ఏంచేస్తున్నాయని ప్రశ్నిస్తున్నాం. హిమ్మత్ లాల్ షా వర్సెస్ అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కేసులో 5గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన అంశాలతో కూడిన సభ లు, సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చని చెప్పింది. ఈ విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. జగన్ రెడ్డి పెట్టే ఇబ్బందుల్ని అధిగమిస్తూ లోకేశ్ రోజురోజుకీ రాటుదేలుతున్నాడు. తను కలవాలనుకున్నవారిని కలుస్తూ, ప్రజలబాధలు వింటూ, వాటికి పరిష్కారమా ర్గాలు సూచిస్తూ లోకేశ్ ముందుకుసాగుతున్నాడు. నిజంగా అసలైన నాయకుడి లక్ష ణం అదే. యువకుడు, మంత్రిగా రాష్ట్రంలో 26వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయిం చిన వ్యక్తి, తనపనితీరుతో 160కి పైగా జాతీయఅవార్డులు పొందిన వ్యక్తి ప్రజల్లోకి వె ళ్తుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎందుకంత కడుపుమంట? నిన్న నగరిలో లోకేశ్ ఎదుటకు వచ్చిన జనప్రభంజనాన్ని చూసి, మంత్రి రోజా చెత్తవాగుడు వాగు తోంది. రోజాకు లోకేశ్ ను విమర్శించేస్థాయి వచ్చిందా?
2019లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉంటే, కర్నూల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటయ్యేది. యువగళం యాత్రను అడ్డుకోవడానికి పోలీసులు పడుతున్న తంటాలు చూస్తే జాలేస్తోంది.. కోపమొస్తోంది
నిన్న బుగ్గన బెంగుళూరులో మాట్లాడుతూ, తాము మూడురాజధానులని చెప్పలేద ని, ప్రజలే తప్పుగా అర్థంచేసుకున్నారని చెప్పాడు. తెలుగుదేశంపార్టీ, చంద్రబాబు గారు ముందునుంచీ ఏదైతే చెప్పారో, అదే నిజమని తేలిపోయింది. ప్రజల్ని వంచించ డానికే వైసీపీ నరహంతకులముఠా మూడురాజధానుల జపంచేస్తోందని, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని తాము చెప్పాము. వైసీపీతప్ప, అన్నిపార్టీలు అమరావతినే సమర్థిస్తున్నాయని, ప్రజలు, ప్రజాసంఘాలుకూడా అమరావతే రాజధాని అంటుంటే బుగ్గన ఏముఖం పెట్టుకొని విశాఖ రాజధాని అనిచెబుతాడు? టీడీపీప్రభుత్వం కర్నూల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుచేస్తుందని చెబితే, నిన్నబుగ్గన ప్రిన్సిపల్ బెంచ్ అన్నాడు. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయిఉంటే, ఎప్పుడో హైకోర్ట్ బెంచ్ కర్నూల్లో ఏర్పాటయ్యేది. సీమలోని సాగునీటిప్రాజెక్టులు పూర్తై లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. పరిశ్రమలరాకతో సీమ కళకళలాడేది. కానీ జగన్ దెబ్బతో సీమ తీవ్రమైన దుర్భిక్షపరిస్థితులు చవిచూస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన, అంబటి, ఎవరైనా సరే, జగన్ నయవంచక ముఠాలోని సభ్యులే. వారిమాటలు వినే ప్రజలు మోసపోయారు. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉంది. యువగళం యాత్రను అడ్డుకోవడానికి పోలీసులుపడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఒకవైపుకోపం వస్తున్నా..మరోవైపు జాలేస్తోంది. రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాస్వామ్యమా.. రాచరికమా.. రాక్షసత్వామా? జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ప్రజలు రాజకీయంగా సమాధికట్టే రోజు దగ్గర్లోనేఉంది.
రాష్ట్రానికి జరిగే అన్యాయంపై నోరెత్తలేనప్పుడు వైసీపీఎంపీలు ఎంతమంది ఉన్నా ప్రజలకు ఏం ఉపయోగం?
రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలు వేధింపులు, సాధింపులకు గురవు తున్నాయి. ఇలాంటి ఒక రాక్షసప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. బుగ్గన మాటలపై వైసీపీనేతలు, తోటిమంత్రులు ఏంసమాధానం చెబుతారు ? రాయలసీమకు ఎక్కడో 1000కి పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే విశాఖ రాజధాని అంటే సీమప్రజలు ప్రభుత్వంపై ఉమ్మేస్తారు. ఇప్పటికే సీమలోని సాగునీటిప్రాజెక్ట్ ల ను నిర్లక్ష్యంచేశారు. ఎగువన కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర డ్యామ్ కడుతుంటే, సీమఎడారి అవుతుంటే వైసీపీఎంపీలు ఢిల్లీలో ఏంగడ్డి పీకుతున్నారు? కనీసం కేంద్ర జలశక్తిమంత్రిని కలిసి రాయలసీమ ప్రజలకు జరిగే అన్యాయాన్ని చెప్పలేరా? బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తుదితీర్పు అమల్లోకి రాలేదని, బచావత్ ట్రైబ్యునల్ లో ఆ ప్రాజెక్ట్ కి నీటికేటాయింపులు లేవని దద్దమ్మలైన వైసీపీఎంపీలు, ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్ట్ కి సీ.డబ్ల్యూసీ ఎలాఅనుమతి ఇచ్చిందని, కేంద్రప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.5వేలకోట్ల నిధులు ఎలా ఇచ్చిందని మోదీని ప్రశ్నించరా? రాష్ట్రంకోసం, ఓట్లేసిన ప్రజలకోసం నోరుతెరవలేని వైసీపీఎంపీలు ఎంతమంది ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి?
తమభవిష్యత్ కోసమే ప్రజలు లోకేశ్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు
నారాచంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయితేనే తమకు భవిష్యత్ అని ప్రజలంతా భావిస్తున్నారు కాబట్టే, లోకేశ్ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. యువగళం యాత్రలో బీసీలే ముందుండి లోకేశ్ ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ముందుకుసాగుతు న్నారు. యువగళం పాదయాత్ర వైసీపీప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే ఉజ్వల యాత్రగా మారనుంది.”