రక్తదానం మహాదానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు

రక్తదానం మహాదానమని, ఒకరికి రక్తం ఇచ్చి ప్రాణదాత అయ్యే అపురూప అవకాశం ఒక్క మానవులకే ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సూచించారు. రక్తimage-1 దానం ద్వారా విపత్కర పరిస్థితుల్లో రోగులను ఆధుకోవచ్చునని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు.

సీతాఫల్మండి లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ సక్కు బాయి, డాక్టర్ విజయ శాంతి, డాక్టర్ రవీందర్ గౌడ్ లతో పాటు వివిధ స్వచ్చంద సంస్థల పక్షాన జి.చంద్రశేఖర్ తదితరుల ఆద్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్నిimage-2 ఉప సభాపతి పద్మారావు గౌడ్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తెరాస నేతలతో పాటు తీగుల్ల రామేశ్వర్ యువ సేన సభ్యులు , అడ్డగుట్టకార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ దంపతులకు రక్త దానం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ లాతో పాటు తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply