Suryaa.co.in

Andhra Pradesh

బొల్లా అరాచక పాలనను అంతమొందించాలి

– మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
– బొల్లా దుర్మార్గాన్ని తరిమికొట్టడమే లక్ష్యం
– మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు

రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడం లక్ష్యంగా టిడిపి శ్రేణులు పనిచేసే ప్రజల్లో చైతన్యం నింపాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన శంఖారావం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఐదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాన్ని, వైసిపి అవినీతి అక్రమాలను, అభివృద్ధి అంటే తెలియకుండా చేసిన అరాచక పాలనను ఎండగట్టి టిడిపి జనసేన సైనికులు ప్రతి ఇంటికి తీసుకువెళ్లి వైసిపిని సాగనంపడమే ధ్యేయంగా పనిచేయలన్నారు. వినకొండలో అహంకార పాలన సాగుతుందని, ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దోపిడీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గాన్ని ఈ నియోజకవర్గ నుండి తరిమికొట్టడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ రాగానే కార్యకర్తలు నాయకులు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే దుర్మార్గాలన్నీ శివయ్య స్తూపం సెంటర్లో తేల్చుకోవడానికి సిద్ధమని, దుర్మార్గాన్ని సహించేది లేదన్నారు.

వినుకొండలో లాండ్ ఆర్డర్ అదుపుతప్పిందని, రైతు, సీనియర్ రాజకీయ నాయకుడు గంగినేని అంజయ్య తల పగలగొట్టడం ఎమ్మెల్యే దుర్మార్గానికి నిదర్శనం అన్నారు. ముస్లిం మైనారిటీ నాయకుడు షమీంఖాన్ని అడ్డగోలుగా దాడి చేసి గాయపరచడం .. ఇలా ఎమ్మెల్యే దౌర్జన్యాలు చేస్తుంటే అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే లాండ్ ఆర్డర్ ఏ స్థాయిలో అదుపుతప్పిందో అర్థమవుతుందన్నారు.

ఎన్నికల కోడ్ రాగానే ఇటువంటి దౌర్జన్యాలకు తావు లేదని, అన్నింటిని తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి సమస్యను, వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరగాలంటే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును మనమందరం కలిసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE