అవినీతి అనకొండగా నిలిచిన పెద్దిరెడ్డి

Spread the love

అవినీతి అనకొండ గా నిలిచిన పెద్దిరెడ్డి మూడేళ్లలో రూ.6,889కోట్ల ప్రజల సొమ్ముని కొల్లగొట్టాడు.
– జగన్ రెడ్డి కేబినెట్లో నిన్నటివరకు ఉన్న మంత్రుల అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తే, అందరూ జైల్లోఉండాల్సిందే.
• ఇసుక, మద్యం, మైనింగ్, ఎర్రచందనం, భూ మాఫియాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేబినెట్లోనే టాప్ మోస్ట్ అవినీతిపరుడిగా నిలిచాడు
• పెద్దిరెడ్డి అవినీతి, దోపిడీ గురించి తెలిసికూడా ముఖ్యమంత్రి అతన్ని కేబినెట్లో కొనసాగనిస్తే, మరింతదోచుకోమని అతన్ని ప్రోత్సహించడమే అవుతుంది
– టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడేళ్లలో రాష్ట్రంలో అంతులేనిఅవినీతికి పాల్పడిందని, ముఖ్యమంత్రి, ఆయన జేగ్యాంగ్ చేస్తున్న అవినీతిని టీడీపీ అనేకసార్లు ఆధారాలతో సహా బయటపెట్టినా కూడా జగన్ రెడ్డి వారిపై ఎలాంటిచర్యలుతీసుకోలేదని, మంత్రులుగా పనిచేసి, రాజీనామాలు చేసిన 24మంది అవినీతిబాగోతానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తమవద్దఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

నిన్నటివరకు జగన్ రెడ్డి కేబినెట్ లో ఉన్న దోపిడీదారుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అవినీతిఅనకొండగా నిలిచి ప్రజల్నిలూఠీచేయడంలో అగ్రస్థానంలో నిలిచాడు. అంతులేని సంపదను పోగుచేసిన కేబినెట్ మంత్రుల్లో తొలిస్థానం పెద్దిరెడ్డిదే. రూ.6,889కోట్లవరకు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డాడు. పుంగనూర్ వీరప్పన్ గా పేరుపొందిన పెద్దిరెడ్డి అవినీతివ్యవహారాలకకు సంబంధించిన సాక్ష్యాలను టీడీపీ సేకరించింది.

పెద్దిరెడ్డికి శివశక్తి డెయిరీ ఉంది. పాలఉత్పత్తిదారులుగాఉన్న సంఘాలవారిని, పాడిపై ఆధారపడి బతికే పేద, మధ్యతరగతిమహిళలను బెదిరించి, వారివద్దనుంచి తక్కువధరకు, కేవలం లీటర్ పాలను రూ.18కేకొని, వారిపొట్టకొట్టి, రూ.700కోట్లవరకు సంపాదించాడు. పేదలు ఎండలో గేదెలు మేపుకొని, నానాఅవస్థలుపడి పాలుఅమ్ముకుంటే, ఆ పాలనుకూడా కాజేయడానికి సిద్ధమయ్యాడంటే పెద్దిరెడ్డి ఎలాంటివాడో చూడండి.

చిత్తూరులో పెద్దిరెడ్డికి ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉంది. దానిలో మామిడిపండ్లతో వివిధరకాల ఉత్పత్తులు తయారుచేస్తుంటారు. అందులో భాగంగా చిత్తూరుజిల్లాలోని మామిడి రైతులను బెదిరించి, వారివద్దనుంచి తక్కువధరకు మామిడికాయలుకొని తన పల్ప్ ఫ్యాక్టరీకే మామిడిఎగుమతి చేయాలని వారిని భయపెట్టి, రూ.190కోట్లవరకు రైతుల జేబులు కొట్టే కాజేశాడు.

భూమాఫియాలో పెద్దిరెడ్డి చిత్తూరుజిల్లాలోనే కింగ్ గా నిలిచాడు. తిరుపతి, మదనపల్లి, తంబళ్లపల్లి, నగరి ప్రాంతాల్లో యథేచ్ఛగా తననుఅడిగేవాడు, ఆపేవాడే లేడన్నట్లుగా 800ఎకరాలకుపైగా భూ కబ్జాలకుపాల్పడ్డాడు. పెద్దిరెడ్డి ఆక్రమించిన 800ఎకరాల భూమి విలువ రూ.810కోట్లవరకు ఉంది. అలానే తిరుపతి హథీరాంజీ మఠానికిచెందిన రూ.60కోట్ల విలువైన 3ఎకరాలను కూడా దిగమింగాడు.

ఆఖరికి డీకేటీ పట్టాభూముల్నికూడా పెద్దిరెడ్డి వదల్లేదు. చిత్తూరుజిల్లాలోని పుంగనూరులోని కల్లూరులో ఉన్న రూ.870కోట్ల విలువచేసే 88ఎకరాల డీకేటీ భూమిని స్వాహాచేశాడు. తనబినామీలతో తంబళ్లపల్లిలోనే రూ420కోట్ల విలువచేసే 300ఎకరాలను మూడోకంటికి తెలియకుండా మింగేశాడు. పెద్దిరెడ్డి లాంటి అవినీతి అనకొండ ఆఖరికి పేదలకు ఇచ్చే సెంటుపట్టాభూముల్నికూడా వదల్లేదు. పేదలకు ఇచ్చిన సెంటుపట్టాభూములకొనుగోలు, చదునుపేరుతో రూ.85కోట్లవరకు హాంఫట్ చేశాడు.

ఇసుక మాఫియాలోనూ పెద్దిరెడ్డి తన చక్రం తిప్పాడు
తంబళ్లపల్లి కేంద్రంగా పెద్దిరెడ్డి రూ.130కోట్లవరకు ఇసుక అమ్మకాలతో కాజేశాడు. అలానే చిత్తూరుకేంద్రంగా రూ.70కోట్లు, పీలేరుకేంద్రంగా రూ.62కోట్లను ఇసుకకుంభకోణంలో కొల్లగొట్టాడు. పాల ఉత్పత్తిదారులు, మామిడిరైతులు, భూకబ్జాలు, ఇసుకఅమ్మకాలతో పెద్దిరెడ్డి అవినీతి దాహంతీరలేదు. అందుకోసం ఏకంగా మైనింగ్ మాఫియానే సృష్టించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనింగ్ పరిశ్రమపై కన్నేసి అందినకాడికి బొక్కేశాడు. మైనింగ్ మాఫియాకోసం పీలేరులో రూ.415కోట్లవిలువైన 230ఎకరాలను, మదనపల్లిలో రూ.170కోట్ల ఖరీదుచేసే 70ఎకరాల ను, తంబళ్లపల్లిలో రూ.82కోట్లవిలువైన 192ఎకరాలను దిగమింగాడు.

ఆయా భూములపై ఆధారపడి బతుకున్న వేలాదికుటుంబాలను రాత్రికిరాత్రే ఊళ్లనుంచి పారిపోయేలా చేశాడు. మైనింగ్ మాఫియాతో చక్రంతిప్పిన పెద్దిరెడ్డి ఆ శాఖకు చెందిన ఫైళ్లక్లియరెన్స్ కూడా తనకు క్యాష్ వచ్చేలా మార్చుకున్నాడు. ఫైళ్లు క్లియరెన్స్ చేయాలంటే 50శాతం షేర్ ఇవ్వాలనే నిబంధనపెట్టి, మైనింగ్ పరిశ్రమను గడగడలాడించాడు.

మద్యంమాఫియాలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన పెద్దిరెడ్డి, దానిద్వారా రూ.375కోట్లవరకు పోగేసుకున్నాడు. నాసిరకం జేబ్రాండ్ మద్యం నాటుసారా అమ్మకాలను తన నియోజకవర్గం తోపాటు చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఉధృతంగా సాగించాడు. జేబ్రాండ్ మద్యాన్ని డిస్టిలరీలనుంచి కొనుగోలు చేసే క్రమంలో రూ.340కోట్లు, మద్యం ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్ట్ పేరుతో రూ.35కోట్లు తన ఖజానాలో వేసుకున్నాడు.
ఎర్రచందనం స్మగ్లింగ్ తో ఖండాంతరాలు దాటిన పెద్దిరెడ్డి అవినీతి..

టీడీపీ హయాంలో ఎర్రచందనం దుంగపట్టుకోవాలంటేనే వణికిపోయారు. కానీ జగన్ రెడ్డి జమానాలో శేషాచలం అడవే మాయమైంది. రూ.1800కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పెద్దిరెడ్డి విదేశాలకుతరలించి, ఏకంగా అడవుల్నే భోంచేశాడు. పెద్దిరెడ్డి అధికారం దెబ్బకు డిప్యూటీసీఎంగా ఉండికూడా నారాయణస్వామి డమ్మీ అయిపోయాడు. తానుమంత్రిగా, తనకొడుకు, ఇతర కుటుంబసభ్యులకు వివిధపదవులిచ్చి ప్రజలసొమ్మును దారుణంగా దిగమింగాడు. జగన్ రెడ్డికి తెలియకుండానే పెద్దిరెడ్డి ఆయన పేరుచెప్పి తనమంత్రిపదవితో ఇన్నివేలకోట్లు పోగేశాడా?

పెద్దిరెడ్డిఅవినీతి, దోపిడీపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందే. తెలుగుదేశంపార్టీ పెద్దిరెడ్డి అవినీతికి సంబంధించి విడుదలచేసిన సమాచారంపై ముఖ్యమంత్రి తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఒక్కపెద్దిరెడ్డే కాదు… జగన్ రెడ్డికి రాజీనామాలుసమర్పించిన మంత్రులందరిఅవినీతి, దోపిడీపై సీబీఐతో విచారణజరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్లపాటు ప్రజల్ని, రాష్ట్రాన్ని లూఠీచేసి, ఏమీతెలియని నంగనాచుల్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంచెబితే అదిచేస్తామంటున్న మంత్రులందరి అవినీతి జాతకాలను బయటపెట్టే తీరుతాం.

తాము లేవనెత్తే అంశాలపై ముఖ్యమంత్రి సీబీఐ విచారణజరిపిస్తే, మొన్నటివరకు జగన్ రెడ్డి కేబినెట్లో ఉన్నవారంతా జైలుకు వెళ్లాల్సిందే. రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని సహజవనరుల్ని, ప్రజల్నివదలకుండా దోచుకున్నది కాక, రూ.7.80లక్షలకోట్లు అప్పులుచేశారు. ఆ అప్పులసొమ్మైనా ప్రజలకోసం ఖర్చు పెట్టారా అంటే అదీలేదు. అప్పులతెచ్చిన సొమ్ముని కూడా పప్పుబెల్లాల్లా మెక్కేసిన జగన్ రెడ్డి అతని మంత్రివర్గం, ప్రజలను కష్టాలఊబిలో ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంక మారుస్తోందని చెప్పడానికి చాలాచాలాబాధపడుతున్నాం.

ప్రధాని మోదీ ముఖ్యమంత్రిని పిలిచి గదుల్లో కూర్చోబెట్టి మాట్లాడకుండా, రాష్ట్రంలో జేగ్యాంగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నదోపిడీని అరికట్టాలి. ప్రతిపక్షంగా మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీ, అవినీతిని ప్రజలకు తెలియచేయడం మాబాధ్యత. పెద్దిరెడ్డి లాంటి అవినీతి అనకొండను తిరిగి కేబినెట్ లో సాగిస్తాడో, తొలగిస్తాడో అది ముఖ్యమంత్రి ఇష్టం. పెద్దిరెడ్డిని కేబినెట్ లో కొనసాగించడమంటే మరిన్ని వేలకోట్లు దోచేసుకోమని అతనికి ఇంకాఅధికంగా స్వేఛ్ఛ ఇవ్వడమే.

ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని వీడియోగేమ్ లు ఆడుకుంటే, మంత్రులేమో రాష్ట్రంపై పడి ప్రజల సొమ్ముని, ప్రకృతివనరుల్ని అడ్డగోలుగా దోచేశారు. తాముచేసేవి కేవలం ఆరోపణలుకాదు.. తననేం పీకుతారు అంటూ బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడిన జగన్ రెడ్డి, తనకేబినెట్ చేసిన అవినీతిని, ప్రజల్ని దోచుకున్న మంత్రులను ఏవిధంగా పీకుతాడని ప్రశ్నిస్తున్నాం.

Leave a Reply