Suryaa.co.in

Family

బ్రహ్మముహూర్తం – పురాణగాథ

కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఒక సమయంలో తల్లి వినత పుత్రు డిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్నిసూర్యు నికి సారథిగా నియ మించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలమంటారు. ఆ సమయ మున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు.

ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు 30 ముహూర్తాలు జరు గుతాయి. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ము హూర్తం అంటారు (ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకా రంగా 24 నిమిషాలు).

తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీముహు ర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూ ర్తం అని అంటారు. సూర్యో దయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. ఈముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యో దయం అవడానికి, 48-98 నిమి షాల మధ్యకాలం ఇది.

ఆధ్యాత్మిక అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబు తోంది. ఈ బ్రహ్మ ముహూర్త కాల మున ధ్యానం, జపతపాదులు చేయు వారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉం టుంది విద్యార్ధులు చదివే చదువు, చేసే శుభకార్యా లు దిగ్విజయంగా పూర్తవుతాయి. బ్రహ్మముహూర్తంలో చల్లని నీటితో తల స్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి.

ధ్యానం, జపం, ప్రాణాయా మం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. ఈ సమ యంలో యోగులు, సన్యాసులు, ఋషులు, ధ్యానంలో ఉంటూ వారి వారి తపః శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రస రింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు సిద్ధిస్తుంది. పద్మాసనంలోగానీ, సుఖాసనంలోగానీ కూర్చుని చేసే ధ్యానానికి మనోశక్తి లభిస్తుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవ హిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.

(సేకరణ – ఎంఆర్‌ఎన్‌ శర్మ)

LEAVE A RESPONSE