-భర్త గెలుపు కోసం మంగళగిరిలో విస్తృత ప్రచారం
-వివిధ వర్గాలతో మమేకమవుతూ సమావేశాలు
-చేనేత వస్త్రాలకు బ్రాండిరగ్‌కు జాతీయస్థాయి ప్రణాళిక
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. హెరిటేజ్ వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా గడిపే బ్రాహ్మణి, వారంరోజుల పాటు మండుటెండల్లో ప్రజలను కలిసి తన భర్తని గెలిపించాలని కోరారు. నియోజకవర్గం పరిధిలో డ్వాక్రా సంఘాలు, స్త్రీశక్తి గ్రూపులతో 5 సమావేశాలు నిర్వహించారు. మహిళల సాధికారతకు టీడీపీ ఎంతో కృషి చేసింద ని, లోకేష్ స్త్రీ శక్తి ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నారని వారికి వివరించారు. యర్రబాలెం సంధ్య చిల్లీ పౌడర్ ఫ్యాక్టరీ, పచ్చళ్ల ఫ్యాక్టరీ, కూరగాయల మార్కెట్, విజయ పచ్చళ్ల ఫ్యాక్టరీ, పసుపు తయారీ కేంద్రం, ట్విల్స్ వస్త్రాల తయారీ యూనిట్, తాడేపల్లిలో చేపలు అమ్మే మహిళలు, బేతపూడిలో మల్లెపూలు ఏరే మహిళలతో మాట్లాడి లోకేష్‌ను గెలిపించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎకో పార్కుని సందర్శించి వాకర్స్‌తో మాట్లాడారు. నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులతో వాలీబాల్ ఆడారు. పై కేర్ సాఫ్ట్వేర్ కంపెనీని సందర్శించి ఉద్యోగు లతో కంపెనీలు రావాల్సిన అవసరం ఉందని, టీడీపీ వల్లే అది సాధ్యమని వివరిం చారు. అపార్ట్మెంట్ వాసులతోనూ, వివిధ వర్గాలతో సమావేశమై లోకేష్ గెలుపు తోనే మంగళగిరి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. మంగళగిరి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. మంగళగిరి చేనేతకు మహర్దశ తీసుకొస్తానని తన భర్త నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు బ్రాహ్మణి విశేష కృషి చేశారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు మంచి ధర రావడంతోపాటు జాతీయ స్థాయిలో బ్రాండిరగ్ కల్పించేందుకు, చేనేత కళాకారులకు ఆర్థికంగా ఉపయో గపడే ప్రణాళిక సిద్ధం చేశారు. టాటా వారితో మాట్లాడి వారి అనుబంధ సంస్థ తనేరియా సహకారంతో మంగళగిరిలో వీవర్ శాల ఏర్పాటు చేయడంలో బ్రాహ్మ ణిదే కీ రోల్. నారా లోకేష్ ఎమ్మెల్యేగా తొలిసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు భార్య బ్రాహ్మణి ప్రచారం, కృషి ఎంతో దోహదపడిరది.