Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్‌ విజయ శంఖారావం

– ఓ వైపు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం
– మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభలతో దూకుడు
– పాదయాత్ర కవర్‌ చేయని జిల్లాల్లోనూ శంఖారావం సభలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరచూ అంటుంటారు. తనయుడు నారా లోకేష్‌ కూడా టీడీపీ కర్మాగారంలో తయారైన నాయకుడే. మేలిమి నాయకత్వ లక్షణాలతో 2024 ఎన్నికల్లో విజయ శంఖారావం మోగించాడు. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్‌, వెనువెంటనే పాదయాత్ర కవర్‌ చేయని జిల్లాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించారు. ఓ వైపు తాను పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభలు నిర్వహించారు. నెల్లూరు, రాజంపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, ఏలూరులో యువగళం సభలు జరిగాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ‘హలో లోకేష్‌’ తరహాలో యువతతో ముఖాముఖి లోకేష్‌ మాట్లాడారు. యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తామో వివరించి కొత్త ఓటర్లు, యువత మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. రాష్ట్రంలో కూటమి ఎన్నికల ప్రచార సభలకు ప్రధాని, ప్రముఖుల రాక సందర్భంగా వాటి ఏర్పాట్ల బాధ్యతలు చూస్తూనే.. ఆ సభలకు టీడీపీ ప్రతినిధిగా హాజరయ్యారు లోకేష్‌. తమిళనాడు లోనూ కూటమి తరపున.. బీజేపీ అభ్యర్థి తరపున లోకేష్‌ ప్రచారం చేశారు. అలుపె రుగని ప్రచారం, రాష్ట్రమంతా వాయువేగం పర్యటనలతో యువత నుంచి కూటమికి మద్దతు కూడగట్టారు లోకేష్‌. యువగళం వినిపించిన లోకేష్‌…కూటమి విజయంలో కీలకపాత్ర పోషిస్తూ విజయ శంఖారావం పూరించారు.

LEAVE A RESPONSE