– ఆ వర్గాలు మళ్లీ టీఆర్ఎస్కు ఓటేస్తాయా?
అన్ని పార్టీలలోని కొందరు రాజకీయ నాయకుల కోరిక మేరకు తెలుపుతున్న కొన్ని విషయాలు…
భారత రాష్ట్ర సమితి (BRS) పెడుతున్నాం.
– కేసిఆర్ , కేటీఆర్
అది భారత రాష్ట్ర సమితి కాదు భారత డ్రామా సమితి (BDS)
– ప్రతిపక్షాలు
కేసీఆర్ తన కుమారుడు అయిన కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారు. కడుపు తీపికి ఇంత కంటే ఋజువేముంటుంది? తను కేంద్ర రాజకీయాలు చూసుకుంటే , కుమారుడు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటాడు అని కేసీఆర్ గారి ఆలోచన. భారత రాష్ట్ర సమితి ఎందుకు పెడుతున్నారు అంటే.. తెలంగాణ సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్రాల వారు కోరు కుంటున్నారు. బంగారు తెలంగాణ లాగా బంగారు భారత దేశం చేయాలి. అందుకే భారత రాష్ట్ర సమితి పెడుతున్నా.. అని కేసీఆర్ చెప్పినా..
అసలు తెలంగాణలో పెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకం కొస యేళ్ళలేదన్నది పచ్చి నిజం. వచ్చే ఎన్నికలలో
గెలవడం కోసం ప్రశాంత్ కిషోర్( రాజకీయ శకుని) సలహాలు తీసుకుంటుండు కోట్ల రూపాయలు ఇచ్చి దేశంలో పార్టీ పెట్టగల నడపగల ఆర్థిక వనరులు కేసీఆర్ వద్ద ఉన్నవి. కానీ భారత రాష్ట్ర సమితికి , 10 ఓట్లు వేసే ప్రజలు ఏ రాష్ట్రంలో కనపడటం లేదు. వెయ్యరు కూడా! తెలంగాణలో ఇప్పుడున్న సగం టీఆర్ఎస్ MLA లకు మళ్ళీ సీట్లు ఇవ్వడం కుదరదు..ఖమ్మం సభలో ఈ విషయాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు..
టీఆర్ఎస్ పార్టి కి తీవ్రంగా వ్యతిరేకత ఎందుకు ఉంది. అంటే..
1). ధరణి తెచ్చి రైతులకు కొత్త సమస్యలు సృష్టించి, ఇప్పటికీ 10 లక్షల మంది రైతులు ముప్పు తిప్పలు పడుచున్నారు..వీరు ఓట్లు టీఆర్ఎస్ కు వేయరు
2) అసైన్డ్ భూమి లాక్కుంటున్నారు 25 లక్షల యేకరాలు 15 లక్షల మంది రైతుల వద్ద ఉంది వారికి అమ్ముకునే హక్కు కలిపించ లేదు, వారు తెరాస ఓటు వేయరు.
3) కౌలు రైతులు ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది ఉంటారు, 75 శాతం భూమిని సాగు చేసేది వీరే.
వీరి కష్టానికి గుర్తింపు లేదు ఎలాంటి భరోసా లేదు.
4) ఎక్స్ సర్వీస్ మెన్ ,ఫ్రీడమ్ ఫైటర్ లకు ఇచ్చిన భూమి కూడా, ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి. వీరు కూడా ఓటు వేయరు.
5) గ్రామ పంచాయితీ లేఅవుట్ల కు, LRS లక్షలలో వసూలు చేస్తున్నారు LRS రద్దు
చేయలేదు,గ్రామాలలో LRS లేని ప్లాట్లకుఇల్లు కట్టు కోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. వీరు టీఆర్ఎస్ పార్టీ కి ఓటు వేయరు.
6) ఈ రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురి అయింది బీసీ లు. బీసీ జనాభా ప్రకారం 70 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. బీసీ కుల కార్పొరేషన్ లకు చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. పైగా స్థానిక సంస్థలలో ఉన్న బీసీ రిజ్వేషన్ల ను.. 33% నుండి 18% తగ్గించిన దుర్మార్గం కెసిఆర్ ప్రభుత్వానిది. ఈ నిజాన్ని బీసీ లకు తెలిసేటట్లు చేస్తే వారు ఓటు వేయరు
7) లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి .. రెడ్ల వెలమల భూములు పంట పండటానికి కాళేశ్వరం కట్టిండు. ఈ విషయము (మంత్రి మల్లారెడ్డి చెప్పారు) రైతు బంధు వేల కోట్లు ఈ రెండు కులాలకే ఇచ్చిండు కేసీఆర్.
8) బీసీ,SC,ST పిల్లలు చదువు కునే పాఠశాలలలో, వసతులు లేకుండా పంతుళ్లు లేకుండా చేసి, బీసీ SC,ST ల పిల్లలకు చదువును దూరం చేసిండు. ఈ బడులలో రెడ్ల,వెలమ కమ్మ ల పిల్లలు ఉండరు. అందుకే ఈ దుర్మార్గం, ఇక ప్రైవేటు బడులు కాలేజీలు రెడ్ల ,వెలమ, కమ్మలవే.
9) వైద్యం పేద మధ్య తరగతి వారు మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్ లకు వెళతారు. కానీ ఈ హాస్పటల్ లలో మందులు ఉండవు. సౌకర్యాలు ఉండవు. శుభ్రత ఉండదు. కావాలిసినన్ని ప్రభుత్వ హాస్పిటల్ లు కట్ట లేదు, మందుల రేట్లపై నియంత్రణ లేదు. ఎందుకంటే ఫార్మా కంపెనీలు ప్రవేట్ హాస్పిటల్ లు రెడ్లవి,వెలమలవి కమ్మలవి. చారణ గోలి వందకు అమ్ముతారు. పెద్ద రోగం వచ్చింది అంటే ఏదో ఒకటి పొలమా ఇల్లా ప్లాట్ అమ్మాల్సిందే.
అంతెందుకు .. టెస్టు లు రాస్తే డాక్టర్ కు 40% మని డయగ్నటే సెంటర్ లు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తాయి. ఈ దోపిడీని ఆపే యంత్రాంగం లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విషయాలు ఉన్నాయి టీఆర్ఎస్ చేసిన అన్యాయాలు!
ఇవి కొందరి నాయకుల కోరిక మేరకు రాస్తున్నాను.
