Suryaa.co.in

Telangana

ఎన్నికల కమిషన్ ను కలిసిన బిఆర్ఎస్ ప్రతినిధులు

-పోలింగ్ బూత్ కు వెయ్యి ఓటర్ల వరకే చూడాలి
– జిహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ బూత్ లు పెంచాలని కోరిన బిఆర్ఎస్
– గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఓటర్లను కొనసాగించాలని వినతి
– ఓటర్ల ఎన్ రోల్ మెంట్ ఎలక్షన్ కమిషనే చేపట్టాలని కోరాం
– బి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి డా. రాకేష్

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ సిఈఓ సుదర్శన్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, పల్లె రవికుమార్ గౌడ్, డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ బుధవారం కలిశారు.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ అధికార ప్రతినిధి డా. రాకేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు ఇవాళ ఎన్నికల ప్రధానాధికారితో భేటీ అయ్యి బిఆర్ఎస్ పార్టీ తరఫున పలు సూచనలు చేశామని తెలిపారు.

జిహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ సరళి తక్కువగా ఉంటుందని, అందుకు ఓటర్లకు పోలింగ్ బూతులు దూరంగా ఉంటున్నాయని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ బూత్ లు సంఖ్య పెంచాలని, ఒక్కో పోలింగ్ బూత్ కు వెయ్యి ఓటర్ల వరకే ఉండేలా చూడాలని కోరామని చెప్పారు.

LEAVE A RESPONSE