-కేసీఆర్…. ఖాసీం చంద్రశేఖర రజ్వీ
-దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా…..
-రాహుల్ గాంధీ ఓ గజినీ…..
-యే కాంగీ, బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, బీహార్ జేడీ, ఔర్ తెలంగాణ కేడీ… మోదీని ఏమీ చేయలేరు
-తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం…శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
-సుష్మాస్వరాజ్ కు నా సెల్యూట్
-చీమల పుట్టలో పాములా చేరిన కేసీఆర్ కుటుంబం
-కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా సహకరించిన కేసీఆర్
-రైతు సగటు ఆదాయంకంటే సాగుపై కేసీఆర్ కుటుంబ ఆదాయం వందల రెట్ల ఎట్లా పెరిగాయి?
-ఇదిగో రాజీనామా…. 24 గంటల ఫ్రీ పవర్ పై పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీలకు బండి సవాల్
-మణిపూర్ కు పీఎం వెళ్లలేదని అడిగే నైతిక అర్హత మీకుందా?
-కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం
-పార్లమెంట్ లో బండి సంజయ్ అద్బుత ప్రసంగం
-పార్లమెంట్ లో ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని వివరిస్తూ సంచలనం సృష్టిస్తున్న బండి సంజయ్
భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సైతం విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నవ్వొస్తుంది. ఏ కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… సభ్ లోగ్ మిల్ కర్ ఆయే తోబీ మోడీ జీ కో నహీ రోకేంగే…. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్రమోదీ’’అంటూ విరుచుకుపడ్డారు.
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ను పూర్తిగా తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు ‘‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా… ఇదిగో నా రాజీనామా… నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’’ అంటూ సవాల్ విసిరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరుగుతున్న చర్చపై బీజేపీ పక్షాన బండి సంజయ్ 10 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సందర్భగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమితోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల తీరుపై విరుచుకుపడ్డారు. సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
రాహుల్ వ్యాఖ్యలు…కాంగీ, దీదీ, కేజ్రీ, జేడీ ఔర్ కేడీ.. మోదీని ఏమీ చేయలేరు
అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ తీర్మానం ఎందుకు ప్రవేశఫెట్టారో వారికే తెలియదు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడి వ్యవహారశైలి చూసి ప్రపంచమంతా నవ్వుతోంది. ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. గిట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ భారతమాతను హత్య చేశారంటూ కించపర్చారు. భారత మాతవైపు కన్నెత్తి చూస్త్తే కళ్లు పీకే ఆదర్శ నేత మోదీ. వీళ్లంతా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు… యే కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… వీళ్లతో మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు.. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోంది.
తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…సుష్మాకు సెల్యూట్…
ఈ పవిత్రమైన పార్లమెంట్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల 1400 మంది యువకులు బలయ్యారు. జై తెలంగాణ అంటూ రివాల్వర్ తో కాల్చుకున్నరు. ట్రైన్ కు ఎదురుగా పోయి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదే సభ వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహానేత. చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుండి అనుకూలం. తెలంగాణకు అనుకూలంగా కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ.
చీమల పుట్టలో తాచుపాము జొర్రింది..
చీమల పుట్టలో తాచుపాము జొర్రినట్లు..తెలంగాణలో ఒక కుటుంబం జొర్రింది…అవినీతి యూపీఏ ఐఎన్డీఐఏగా ఎట్లా మారిందో….. బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి. బీఆర్ఎస్ లీడర్ పేరు ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు. బీఆర్ఎస్ నేతది ఒకే పని… అదేమిటంటే.. రాత్ బర్ పీతా… దిన్ బర్ సోతా… కిస్ సే బీ నహీ మిల్ తా… యే హై దేశ్ కీ నేత.
పరివార్ అవినీతి-ఆస్తుల పెరుగుదల….
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఆస్తుల ఏ స్థాయిలో పెరిగినయంటే…అధికారంలోకి రాకముందుతో పోలిస్తే 2018 నాటికి ఖాసీం రజ్వీ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగినయ్. ఆయన భార్య ఆస్తులు 18వందల శాతం పెరిగినయ్. ఆశ్యర్యమైన విషయమేందంటే.. తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1 లక్షా 12 వేల 836 రూపాయలు… కేసీఆర్ వ్యవసాయం ఆదాయం కోటి రూపాయలు… కేటీఆర్ 59 లక్షల 85 వేలు.. రైతుల కంటే 5 వేల శాతం అధికం… కోడలు ఆదాయం 2 వేల శాతం అధికం… నా తెలంగాణలో రైతులు నష్టపోతున్నారు.
24 గంటల ఫ్రీ పవర్ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
నిన్న బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ సాక్షిగా 24 గంటల ఫ్రీ పవర్ సప్లయ్ పచ్చి అబద్దం.. పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిండు. నేను సవాల్ చేస్తున్నా… 24 గంటలు ఫ్రీ పవర్ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇక్కడ నుండే రైతుల వద్దకు పోదాం… నేను నిరూపిస్తా ఫ్రీ పవర్ ఇవ్వడం లేదని… మీ సీఎం రాజీనామా చేస్తారా? మీరంతా ముక్కు నేలకు రాస్తరా?
తెలంగాణకు కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా.. దారి మళ్లించిన కేసీఆర్…
కొత్త రాష్ట్రానికి కేంద్రం పుష్కలంగా నిధులిచ్చింది. 9 ఏళ్లలో రూ.5 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసింది. రూ.9 లక్షల 60 వేల కోట్లకుగా అప్పులిచ్చింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ఘనత మోదీదే. టాయిలెట్లకు నిధులిస్తే దోచుకున్నరు.. రూ.4 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన భగీరథను 40 వేల కోట్లకు పెంచి దోచుకున్నరు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ఘనత మోదీదే. ఉచితంగా రేషన్ అందిస్తుంటే వాటిని అమ్ముకుంటున్న దొంగలు బీఆర్ఎస్ నేతలు. జాతీయ ఉపాధి హామీ పైసలను దారి మళ్లించారు.
మణిపూర్ సరే…తెలంగాణ సీఎం చేస్తున్నదేమిటి?
మణిపూర్ ఘటనపై అమిత్ షా జీ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లను. తెలంగాణలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా తెలంగాణ సీఎం ఎందుకు వెళ్లలేదు? రైతులు చనిపోయినా వెళ్లరు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా వెళ్లరు.. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నారు… తెలంగాణాలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు… భూ కబ్జాల సంగతేంది?
భరతమాతను తలచి కొలిచే సంస్థ ఆర్ఎస్ఎస్
లిక్కర్ తో సంబంధమున్నది కాంగ్రెస్ కే… ఈ దేశంలో సనాతన సంప్రాదాయంతో హిందూ సంఘటిత శక్తిని ఏకం చేసే క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్.. ‘‘నమస్తే సదావత్సలే మాత్రుభూమే.. త్వయా హిందుభూమే సుఖం వర్ధితోహమ్. మహామజ్గలే పుణ్యభూమే త్వదర్థే… పతత్వేష కాయే నమస్తే నమస్తే’’ అంటూ భారత మాతను తలచి కొలిచి ఆరాధించే గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్. అంత గొప్ప సంఘాన్ని నిక్కర్ లిక్కర్ అంటూ అవమానించే కాంగ్రెస్ కు పుట్టగతులుండవ్.
కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. ఉప ఎన్నికలు, బీజేపీ గెలుపు
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోడిగారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతన్నయ్.. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే… కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కవల పిల్లలు.
తెలంగాణాలో కాంగ్రెస్ పని ఖతమైంది… కాంగ్రెస్ గల్లీలో లేదు… ఢిల్లీలో లేదు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల GHMC, దుబ్బాక… హుజురాబాద్, మునుగోడు ఎన్నికలతో పాటుకరీంనగర్, నిజామాబాద్, వరంగల్ స్థానిక ఎన్నికల్లో జీరో…. ఫలితాలే నిదర్శనం. తెలంగాణలో అభివ్రుద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం.