Home » బుల్లెట్‌ రైలు మార్గాలు

బుల్లెట్‌ రైలు మార్గాలు

భారత్‌లో రైల్వే రవాణా వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అమృత్‌, వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు బుల్లెట్‌ రైళ్లు త్వరలో రాను న్నాయి. అందుకు అనుగుణంగా కొన్ని రైలు మార్గాలను అధునాతనంగా తీర్చిదిద్దను న్నారు. భారత్‌లో కొత్తగా రానున్న బుల్లెట్‌ రైలు మార్గాలలో ఢిల్లీ-అహ్మదాబాద్‌: 878 కి.మీ, ఢిల్లీ-అమృతసర్‌: 459 కి.మీ, ఢిల్లీ-వారణాసి: 800 కి.మీ, వారణాసి-హౌరా: 760 కి.మీ, ముంబై-నాగ్‌పూర్‌: 765 కి.మీ, ముంబై-హైదరాబాద్‌: 671 కి.మీ, చెన్నై-బెంగళూరు-మైసూరు: 435 కి.మీ ఉన్నాయి.

Leave a Reply