-తెలంగాణలో తొలి ప్రయోగం
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పులపల్లి గ్రామంలో వినూత్నంగా ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్టాండ్ సెంటర్ ను నిర్మించారు. కమలాపూర్ ఎంపీడీవో పల్లవి ఆదేశాలతో సర్పంచ్, గ్రామస్తులు వెరైటీగా బాటిల్స్ తో బస్టాండ్ సెంటర్ కు శ్రీకారం చుట్టారు.
హుజురాబాద్ టూ పరకాల రహదారిపై ఉప్పలపల్లి లో బస్టాండ్ సెంటర్ లేక గత కొద్ది రోజులుగా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. కమలాపూర్ ఎంపీడీవో పల్లవి మంచి ఆలోచనతో తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్టాండ్ సెంటర్ ను నిర్మించారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్టాండ్ సెంటర్ ను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్, గ్రామస్తులు చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్టాండ్ సెంటరా అంటూ సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్ గా మారింది. కమలాపూర్ ఎంపీడీవో పల్లవికి అభినందనల వెల్లువ సాగుతుంది. ఎంపీడీవో పల్లవి వినూత్న ఆలోచన తో బస్టాండ్ సెంటర్ నిర్మాణం కావడంతో చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.