• గత మంత్రి పెద్దిరెడ్డి, అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి అండతో బాధితులపై తప్పుడు కేసులుపెట్టిన పోలీసులు అనంతపురంలో ఎక్సైజ్ పోలీసులపై వైసీపీనేతల దాడిని ఎలా సమర్థించుకుంటారు?
• మంత్రి అప్పలరాజు పోలీసులపై చేసిన దూషణలు పోలీస్ అధికారుల సంఘానికి కనిపించలేదా?
• మాజీ మంత్రి పేర్నినాని మీడియాసాక్షిగా తోటిసిబ్బందిని అవమానిస్తే పోలీస్ అధికారులు ఎందుకు స్పందించలేదు?
• తన దుర్మార్గాల్లో పోలీసుల్ని భాగస్వాముల్నిచేస్తూ, వాళ్లకే అలవెన్సులు నిలిపేస్తే, పోలీస్ సంక్షేమ విభాగం జగన్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
జగన్ రెడ్డి అరాచకపాలనలో ప్రజలతో పాటు పోలీసులు బాధితులు అయ్యారని, కల్తీమద్యంతో పట్టుబడిన వైసీపీ నేతల్ని పట్టుకున్న పాపానికి అనంతపురం జిల్లాలో పట్టపగలే అధికారపార్టీ నేతలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పై దాడిచేసి, మహిళా కానిస్టేబుల్ బట్టలు చింపి దుర్భాషలాడటాన్ని ఖాకీలు ఎలా సమర్థించుకుంటారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“అంగళ్లు, పుంగనూరు బైపాస్ లో చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకోవడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని తమ్ముడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అరాచ కం సృష్టించి, తెలుగుదేశం శ్రేణుల తలలు పగలగొడితే, ముద్దాయిల్ని వదిలేసి, బాధి తులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని ఏమనాలి? వైసీపీరౌడీ మూకల్ని వదిలేసి, దెబ్బలు తిని రక్తంచిందించిన టీడీపీనేతలు కార్యకర్తలపై సెక్షన్ 307కింద కేసులు నమోదు చేయడం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. జరిగిన ఘటనలో చంద్రబాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయడం జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి అతని సోదరుడు ద్వార కా నాథ్ రెడ్డిల రాక్షసానందానికి నిదర్శనం.
సాటి సిబ్బందిపై దాడిచేస్తున్న అధికారపార్టీ నేతల్ని చట్టప్రకారం శిక్షించే దమ్ము, ధైర్యం డీజీపికి ఉన్నాయా? వైసీపీమూకల దాడిలో బాధితులైన చంద్రబాబు, టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టించినంత తేలిగ్గా… డీజీపీ అధికారాపార్టీ వారిపై చర్యలు తీసుకోగలడా?
తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకోకుండా, తలలు పగలగొట్టించుకొని రక్తగాయాలైన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టించిన డీజీపీకి అనంతపురంలో ఎక్సై జ్ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడి కనిపించడంలేదా? మహిళా కానిస్టేబుల్, ఎస్సైలను కొట్టి, మహిళని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీనేతలపై డీజీపీ ఎలాంటి కేసులు పెట్టించి, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాడో సమాధానం చెప్పాలి. వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించే ధైర్యం డీజీపీకి ఉందా?
చట్టప్రకారం తప్పుచేసిన వారికి శిక్షించే దమ్ము, సత్తా రాజేంద్రనాథ్ రెడ్డికి ఉందా..లేక ఎప్పటి లానే జీహుజూర్ అని వదిలేస్తాడా? తమ అవినీతి…దోపిడీ..తప్పులను ప్రశ్నించేవారిపై దాడులు చేయ డం.. పోలీసులసాయంతో తప్పుడుకేసులు పెట్టించడం వైసీపీనేతలకు నిత్యకృత్యమైం ది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడిచే యడం హిందూ ధర్మానికే తలవంపులు. అర్చకుడి యజ్ఞోపవీతాన్ని తెంపేసి, అతని పై దాడిచేయడంపై జగన్ రెడ్డి సమర్థించే స్వామీజీలు ఏం సమాధానం చెబుతారు?
అధికారమదంతో హిందూదేవాలయాలను ధ్వంసంచేయించి, విగ్రహాలు పగలగొట్టించి నప్పుడే జగన్ రెడ్డిని హిందూసమాజం నిలదీసి ఉంటే నేడు అర్చకులపై దాడిచేసే పరిస్థితి వచ్చేదికాదు. ఆలయాలకు.. అర్చకులకు…మహిళలకు…చిన్నారులకు.. ప్రతిపక్షనేతలకు.. మీడియాసంస్థలకు… సామాన్యప్రజలకు…ఎవరికీ ఈ ప్రభుత్వంలో రక్షణలేదు. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ ని దారుణంగా చంపేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.
పోలీసులపై అధికారపార్టీనేతల దాడులు.. దూషణలు..వేధింపులు పోలీస్ అధికారుల సంఘానికి కనిపించడంలేదా?
రిషంత్ రెడ్డి.. అమ్మిరెడ్డి లాంటి పోలీస్ అధికారులు.. కొందరుకిందిస్థాయి సిబ్బంది అధికారపార్టీకి అడ్డగోలుగా సహకరిస్తున్నారు. సుళ్లూరుపేటలో వైసీపీనేత బరితెగించి ఎస్సైపై చేయిచేసుకుంటే పోలీస్ శాఖ సదరునేతను ఏంచేసింది? మంత్రి సీదిరి అప్పల రాజు పోలీసులపై దాడిచేశాడు.. మాజీమంత్రి పేర్నినాని మీడియాసాక్షిగా పోలీసుల్ని దూషించాడు..ఈ ఘటనలు ఏవీ పోలీస్ అధికారుల సంఘానికి కనిపించడంలేదా? అనంతపురంజిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై జరిగిన దాడి కనిపించలేదా?
పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు జగన్ రెడ్డి నిలిపేస్తే, పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించలేని దుస్థితిలోఉంది. శ్రుతిమించిన జగన్ రెడ్డి సర్కారు అవినీతి, అరాచకాలను పోలీస్ వ్యవస్థ కట్టడిచేయలేదని ప్రజలకు అర్థమైంది. పోలీసుల్నే వైసీపీనేతలు కొడుతుంటే, ఇక ఆ పోలీసులు మాకేం న్యాయం చేస్తారని ప్రజలు అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో పోలీస్ అధికారుల సంఘం అర్థం చేసుకోవాలి.
రాష్ట్రంలో పాలన పూర్తిగా అదుపుతప్పింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం అన్నీ అభాసుపాలవుతున్న వైనాన్ని ప్రజలు గమనించాలి. రాబోయే రోజు ల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టకుంటే, భవిష్యత్ లో జరిగే పరిణా మాలు ఇంకా దారుణంగా ఉంటాయి. పోలీస్ శాఖ ఇప్పటికైనా రూల్ ఆఫ్ అమలు చేసి, తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కళంకిత పోలీస్ అధికారులు వారి ప్రవర్తన మార్చుకొని చట్టప్రకారం పనిచేయాలి.” అని బొండా ఉమా సూచించారు.