– పోలీసుల పిటిషన్
రంగారెడ్డి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 10వ తేదీన కోర్టులో హాజరుకావాలని జానీ మాస్టర్‌ను రంగారెడ్డి కోర్టు ఆదేశించింది.
అయితే జానీ మాస్టర్‌పై పోక్సో నమోదు కావడంతో జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేసింది. దీంతో బెయి ల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.