ఎంఓయు లు చేసుకున్నవన్నీ బోగస్ బోగస్ కంపెనీలే
ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీ
మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.కేటీఆర్ గతంలో అమెరికా పర్యటన ఎందుకు చేశారు? బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటన సాగుతుంది.
కానీ బి ఆర్ ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎం గా పనిచేయలేదా? పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఎంఓయు లు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే.
వాళ్ళ పత్రిక నమస్తే తెలంగాణలోనే వార్తలు వచ్చాయి.. ఏ ఏ కంపెనీలతో ఎంఓయు లు చేసుకున్నారో.ప్రజలను మోసం చేశారు. ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీ. వాణిజ్య ఒప్పందాల మేరకు అవకతవకలు చేశారనే దానికి నిదర్శనం ఈ ఒప్పందాలు.
కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్ లే.లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని బాగుచేయాలని పనిచేస్తున్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే ఎలా? ప్రజల సొమ్మును దోచుకొని ప్రతిపక్షంలో కూర్చున్నారు.
రుజువులతో మాట్లాడితే మంచిది.. అడ్డగోలుగా మాట్లాడ్డం మంచిది కాదు
రేవంత్ సర్కార్ పై చేడు ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా పై గాంధీ భవన్ టీమ్ ఎదుర్కుంటది.