Suryaa.co.in

Telangana

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల గద్దర్ కు ప్రజా సంఘాల మద్దతు

ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గత పదేళ్లుగా డిగ్రీ జూనియర్ ఐటిఐ పాలిటెక్నీక్ కళాశాలలు లేవు, ఉపాధి ఉద్యోగ కల్పన లేక నిత్యం ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారు. దాదాపు యాభై కిలోమీటర్లు వెళ్తున్నారు. పేరుకు నగరం నడిబొడ్డున ఉంది. ఇరుకు సందులు, మురికివాడల్లో నివాసం, మురికి కూపాలు గా మారిన బస్తీలు. ఏమాత్రం డిగ్నిటీ లేని డబుల్ బెడ్ రూములు.

ఉపాధి కల్పనకు ట్రైనింగ్ సెంటర్లు లేవు, ఇరుకు రోడ్లు, 60 శాతం జనాభా ఉత్పత్తి కులాలకు చెందిన వారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు, నీడ్ బేస్ కోర్సులు ఉపాధి కల్పన పట్టించుకోని పాలకులు. బస్తీలలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రభుత్వ దవాఖాన లేదు. కనీసం 100 బెడ్ హాస్పిటల్ అవసరం అలాగే ఈఎస్ఐ క్లినిక్ లేదు. గత పది సంవత్సరాలుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పూర్తిగా దివాళా తీసిన రాష్ట్రంగా మారిందని, అలాగే విద్య, ఉపాధి పరంగా రాష్ట్రము ప్రమాదపు అంచున ఉందని భావిస్తున్నారు. ఉపాధ్యాయ, విశ్వవిద్యాలయ నియామకాలు ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయలేదు.

హైదరాబాద్ విశ్వనగరం అని డప్పు కొట్టుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు ప్రజలకు కనీస మౌలిక వసతులు కలుగజేయడంలో పూర్తిగా విఫలమైంది. అలాగే డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ప్రతి రోజు రోడ్ల పైన మురుగు నీరు ప్రవహించి రోడ్లు దుర్గాంధ పూరితంగా తయారయ్యాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు శాశ్విత పరిష్కారం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కంటోన్మెంట్ ఏరియా రోడ్లు రాత్రి సమయాలలో మూసివేయడంతో ప్రజలు దాదాపు నాలుగు ఐదు కిలోమీటర్లు తిరిగి పోవాల్సిన పరిస్థితి ఉంది. కంటోన్మెంట్ పరిధిలోని యాప్రాల్, జవహర్ నగర్ ప్రాంతాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారు ఉన్నారు.

దేశంలో సామాజిక సమగ్రత ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఆస్కార్ ప్రతినిధి డా జ్యోత్స్నా తెలిపారు. సామాజిక తెలంగాణ రావాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని జాతీయ ప్రజా ఉద్యమాల ఐక్య కన్వీనర్ డా సురేష్ బాబు పౌర ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. వెన్నలని గెలిపించడానికి పౌర ప్రజా సంఘాల నుంచి భారత్ జోడో అభియాన్ జాతీయ నాయకులు యోగేంద్ర యాదవ్, పంకజ్ పుష్కర్, ప్రొ జి. వెంకటశివా రెడ్డి, ప్రొ అనంతుల ప్రాణాయనాథ్ రెడ్డి , ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మరియు తెలంగాణ పరిశోధక విద్యార్థుల సమాఖ్య మద్దతు తెలుపుతున్నారు.

LEAVE A RESPONSE