Suryaa.co.in

Andhra Pradesh

సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు

–  తిరుపతిని కమిషనరేట్ చేసేందుకు చర్యలు 
–  ప్రభుత్వ పరిధిలో  ఏబీవీ  అంశం 
– డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

తిరుపతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు (Case) నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి  తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ రిపోర్టు వచ్చాక పూర్తిస్థాయి విచారణ చేపడుతామని తెలిపారు.సాధ్యమైనంత త్వరగా కేసు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిని కమిషనరేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుపతి-చిత్తూరు సరిహద్దుల్లో మూతపడ్డ చెక్‌పోస్టులు తెరుస్తామని ప్రకటించారు. ఏబీవీ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE