– బియ్యం వద్దంటే నగదు
– అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడ లో ప్రయోగాత్మకంగా అమలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు తీసుకునే వారికి నగదుబదిలీ పథకం ప్రారంభం కానుంది. ఆమేరకు సర్కారు చర్యలు ప్రారంభించింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.ఆప్రకారంగా .. ఇకమీదట రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. వద్దంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు పంపిణీ చేస్తారు. తొలుత జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడ ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.కిలోకు ₹12 నుంచి ₹15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. 2నెలలు నగదు తీసుకున్నా, ఆ తర్వాతి నెలలో బియ్యం కావాలంటే తీసుకోవచ్చు.