Suryaa.co.in

National

నెరవేరనున్న జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం

వైష్ణోదేవి ఆలయ పర్వత పాదాల కింద 3.2 కిలోమీటర్ల పొడవైన T-133సొరంగంలో నూతన రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది. ఉధంపుర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వేలైను లో ఇదే చిట్టచివరి ట్రాక్. దీనివల్ల ఇకపై దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ మీదుగా నేరుగా కశ్మీర్ కు చేరడం వీలవుతుంది. జనవరి 26న వందేభారత్ రైలు దీనిపై పరుగులు…

వాహ్.. హుస్సేన్!

– దేవాలయానికి డైమండ్ కిరీటం ఇచ్చిన ముస్లిం కళాకారుడు 600 వజ్రాలతో అలంకరించబడిన వజ్ర కిరీటం – 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ స్టోన్‌తో తయారు చేయబడిన ప్రత్యేకమైన తలపాగా – ఇది విష్ణువు 108 భూలోక నివాసాలలో ఒకటి – ప్రపంచంలో ఇదే తొలి కిరీటం శ్రీరంగం: హిందూ-ముస్లిం మతాల మధ్య ఘర్షణ,…

నింగికెగసిన పీఎస్ఎల్వీ- సీ 60

– ప్రయోగం విజయవంతం శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ సీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ 60ని సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకు వెళ్లింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే…

మౌన మునికి కన్నీటి వీడ్కోలు

– నిగమ్ బోధ్ ఘాట్‌లో ముగిసిన అంత్యక్రియలు – పాడె మోసిన రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి.ఢిల్లీ లోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌన మునికి అంతిమ…

శతక్కొట్టిన విశాఖ కెరటం నితీష్

– శహభాష్..నితీష్ అంటూ ప్రశంసలు – ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ 25 లక్షల నజరానా – చంద్రబాబు ప్రశంసల జల్లు – మెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ – లేచి నిలబడి చప్పుట్లు కొట్టిన సహచరుడు – విశాఖ కుర్రోడికి నీరాజనం మెల్‌బోర్న్ మైదానంలో విశాఖ యువ కెరటం పడిలేచింది. భారత్ కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో.. విశాఖ యువ…

మన్మోహన్ సింగ్,పార్ధివ దేహానికి సోనియా, రాహుల్ గాంధీ ఘన నివాళి

మన్మోహన్‌కు సోనియా రాహుల్ నివాళి ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖా ర్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపార మైన జ్ఞానం, సమగ్రతతో…

బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం?

(వాసు) మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారి టేక్ హోమ్ ఆదాయం పెరుగుతుంది. దీంతో వారికి ఎంతో ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం నుంచి పెద్ద ఊరట…

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్ లో ఒక్కటే!

వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే భారత్ లో కేవలం ఒక్కటే కనిపిస్తుందని తెలిపారు. సెప్టెంబరు 7 లేదా 8న ఏర్పడే చంద్రగ్రహణాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉందని చెప్పారు.

ప్రధాని మోదీ మృతి అంటూ నోరు జారిన యాంకర్

ఢిల్లీ: ప్రముఖ న్యూస్ ఛానల్ ‘ఆజ్ తక్’ యాంకర్ నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ‘ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ప్రకటన విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని వెల్లడించారు’ అని ఆమె అన్నారు. అంతలోనే తప్పు తెలుసుకొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్…

రోజా కూతురికి అవార్డు

నైజీరియా: మాజీ మంత్రి, నటి రోజా కూతురు అన్షు మాలిక 20 ఏళ్ళ వయసులో అరుదైన అవార్డు గెలుచుకుంది. నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో “సోషల్ ఇంపాక్ట్” విభాగంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది.