బీజేపీకి 300 సీట్లు ఖాయం

– ప్రశాంత్ కిశోర్ దేశంలో బీజేపీకి తిరుగులేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఆ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కమలం పార్టీని, ప్రధాని మోదీని అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ విపక్షాలు తప్పుడు వ్యూహాలు బద్ధకం తో వాటిని కోల్పోయాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలి లేదా రెండో స్థానంలో, ఒడిశా, బెంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు.  

Read More

భారతీయుల హృదయం.. బీజేపీ!

1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ స్థాపించిన రోజు.స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా ఒక విశేషమైన పరిణామం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం. అటల్ బీహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ ఆడ్వాణీల ఆలోచన, ఆచరణల ఫలితం, ఫలం భారతీయ జనతా పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన్ సంఘ్ ప్రేరణా, మూలమూ కాగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. జాతీయతా భావం, భారతీయ చింతన, మతాతీతమైన పౌరసమానత్వం, దేశభద్రత, దేశ అభివృద్ధి, విదేశీ మతోన్మాదం నుంచి…

Read More

ఏప్రిల్ 8న పగటిపూట చీకటి

-సూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి -అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు (తులసీరావు ) భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 8న అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సూర్యుని హానికరమైన కిరణాల బారిన పడకుండా రక్షించబడటానికి గ్రహణం…

Read More

‘న్యాయ్ పాత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుద‌ల చేసిన కాంగ్రెస్‌

‘న్యాయ్ పాత్ర’ పేరుతో  కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను హ‌స్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం త‌దిత‌ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున రెండు ‘మేనిఫెస్టో లాంచ్ మెగా…

Read More

రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈరోజు…

Read More

వాయనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో,  ఆయన ఇవాళ వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య రాహుల్ గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు….

Read More

క్షమాపణలు చెప్పిన బాబా రామ్‌దేవ్

పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు వచ్చిన వారిద్దరినీ తీవ్రంగా మందలించింది ధర్మాసనం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ కోర్టు ధిక్కార నోటీసులు…

Read More

ఇక మూడు నెలలూ ముచ్చెమటలే

– ఏప్రిల్‌, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక దేశంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ…

Read More

టోల్‌ చార్జీల పెంపు లేదు

-వాహనదారులకు ఉపశమనం -వెనక్కు తీసుకున్న ఎన్‌హెచ్‌ఏఐ -వాహనదారుల నుంచి -వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టోల్‌ చార్జీల పెంపును వెనక్కు తీసుకుంది. సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలపై టోల్‌ చార్జీలు పెంచనున్నట్లు గతంలో ప్రకటించి న విషయం తెలిసిందే. దీనిని లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరే కించారు. ఈ నేపథ్యంలో టోల్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ వెనక్కి…

Read More

అద్వానీ కి భారతరత్న ప్రదానం

ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భాజపా అగ్ర నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ కి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి…

Read More