రాష్ట్రంలో రాజకీయ పార్టీల పొత్తులపైన మీడియా మల్లగుల్లాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల అవగాహన, పొత్తుల పైన ఎవరికి ఏ విధంగా ఇష్టమైతే,తోచితే వారు ఆ విధంగా ఆలోచించుకుంటూ మీడియా ఛానల్స్ లో డెబేట్లు పెడుతూ వారి ఇష్టప్రకారం వారు అభిమానించే , ఇష్టపడ్డ పార్టీకి, అనుకూలంగా ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారు గురిచేస్తున్నారు. అయితే బిజెపి మొదటి నుండి జనసేనతో అలయన్స్ కుదిరిన ప్పటినుండి తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో గాని, బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నికలలో గాని, జరగబోయే ఆత్మకూరు ఉప అసెంబ్లీ ఎన్నికల్లో గాని బిజెపికి…

Read More

పవన్ అపరిపక్వ రాజకీయం

1. “నేటి దుష్టపాలనకు ముగింపు పలకాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. నేను గతంలో తగ్గి మీకు మద్దతు ఇచ్చాను. ఇప్పుడు మీరు కాస్తా తగ్గి ఆలోచించండి”. ఇదీ! జనసేన అధినేత మాటల్లోని నిగూడార్థమన్న సంకేతాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపికి పంపినట్లుగా నాదెంళ్ళ మనోహర్ వ్యాఖ్యలను బట్టి వెల్లడవుతున్నది. 2. నన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండంటే ఎవరైనా ఎందుకు కూర్చోబెడతారు! ఈ ఆలోచనా తీరే ఎబ్బెట్టుగా ఉన్నది. ఇందులో రాజకీయ పరిపక్వత లోపించింది. 3. దాదాపు…

Read More

రాజీవ్ హత్య కేసు : వ్యూహ నిపుణుడు కార్తికేయన్ అసలేం చేశారు?

రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న వార్త విన్నవాళ్ళు ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. మానవబాంబు పేలి 12 గంటలు కూడా కాకముందే సీఆర్పీఎఫ్ డీజీ కేపీఎస్ గిల్ నుంచి హైదరాబాద్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న కార్తికేయన్ కు ఫోనొచ్చింది. కేసు విచారించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చీఫ్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నది ఆ ఫోన్ సారాంశం. రాజకీయ జోక్యం ఉండకూడదు, ఎట్టిపరిస్థితుల్లోనూ థర్డ్ డిగ్రీ ఉపయోగించను, సీఆర్పీఎఫ్ లోనే కొనసాగించాలి అనే…

Read More

సోనియాపై ఈడీ కేసు వెనుక..?

సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని విచారణకు హాజరుకమ్మని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌) నోటీసులు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ అని కొందరు మిత్రులు అడుగుతున్నారు.ఇదిగో చదవండి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ కంపెనీకి 2000 కోట్లు వరకు ఆస్తులు ఉన్నాయి.1937లలో నెహ్రూ గారు మరో 5000 మంది స్వాతంత్ర సమరయోధులు వాటాదారులుగా కలసి,…

Read More

జగన్‌ సర్కారు తీరు చిత్ర.. విచిత్రం!

-ప్రజలు 151, 22 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు తగిన శాస్తి సాధారణంగా ప్రభుత్వం రకరకాల డిపార్ట్మెంట్ లకు సంబంధించిన పనులకు టెండర్ పిలుస్తుంటారు. అందుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ప్రకారం ఆ జిల్లాలకు, కేంద్రాలకు అలాట్ చేసి టెండర్లు పిలుస్తుంది. ఆ పిలిచిన టెండరుకు క్వాలిఫికేషన్ ప్రకారం కాంట్రాక్టర్లు టెండర్ వేస్తారు ఇస్తారు .అయితే ఈ ప్రభుత్వం కాంట్రాక్టు విధానం లో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.అది పని విలువ నూరు…

Read More

ఎవరికి ఉచితమివ్వాలి?

– అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు – సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ? మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది. ఒరిజినల్ కథ : ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని…

Read More

ధనిక రాష్ట్రం దివాళా తీసింది..ఎందుకు?

– “ప్రాధాన్యత లేని ఖర్చు ఖజానాకు చేటు” “ప్రజలకు, పాలకులకు సంక్షేమ పథకాలే సర్వస్వం అయినప్పుడు ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే మిగితా అన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. తమకు విద్య, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు అవసరం అనే స్పృహ ప్రజలు విస్మరిస్తే… పాలకులు తాత్కాలిక తాయిలాలతో ప్రజలను ఏమర్చి, తమ పబ్బం గడుపుకుంటార”నే విషయం తెలంగాణ రాష్ట్రంలో రుజువయ్యింది. “నీళ్లు, నిధులు, నియామకాల” ఎజెండాతో ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ ఉద్యమం విజయవంతమైనా-ఉద్యమ ఫలాలను…

Read More

మహానాడు మహా జోష్ ఒకవైపు…సరిచేసుకోవాల్సిన తప్పిదాలు మరోవైపు..

మహానాడు మహాద్భుతంగా జరిగింది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ జోష్ మరోసారి కొట్టచ్చినట్లు కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చి, టీడీపీకి మరోసారి అధికారం ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు. ఐతే మహానాడులో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను అధినేత చంద్రబాబు, నాయకత్యం తెలుసుకోగలిగితే నే పార్టీ కి భవిష్యత్తు. నేను రెండు రోజులు జరిగిన మహానాడు తీరుతెన్నులు గమనించి చేస్తున్న సూచనలు ఇవి. మహత్తరమైన మహానాడు వేదికపై ఆశీనులయిన వారిలో .. ఎవరు ముందు…

Read More

తెలంగాణ ఆకాంక్షలు మిగిలే ఉన్నాయి

మా భూములు మాకే, మా నీళ్లు మాకే, మా వనరులు మాకే, మా ఉద్యోగాలు మాకే అంటూ సాగిన సాగిన తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ, స్వయంపాలన ప్రధాన సూత్రాలుగా ప్రజలకు బోధించి ఎన్నో త్యాగాలతో, ఎందరో ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకొని ఎనిమిదేండ్లు దాటినా తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ సాధించుకొని ఏమున్నది గర్వకారణం అని ప్రజలు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కే స్థితిలో తెలంగాణ సమాజం వుంది. గారడి మాటలతో జూటా…

Read More

తెలుగుదేశం స్థాపన ఒక సామాజిక విస్పోటనం, ఒక రాజకీయ భూకంపం, ఒక పాలన సంస్కరణ

తెలంగాణ బహుజన నాయకుడు చేకూరి చైతన్య దాదాపు నాలుగు నెలల క్రితం… అన్నా ఎన్టీ రామారావు మీద, ప్రస్తుత జాతీయ రాజకీయాల నేపథ్యంలో, అలాంటి నాయకుల అవసరం మీద ఒక ఆర్టికల్ రాయి… అని మెసేజ్ పెట్టాడు.ఈ రోజు సరైన సందర్భం అనుకుంటున్నాను. ఎన్టీఆర్ చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, చాలామంది ఆయన సినిమా నటుడని, శ్రీకృష్ణుడని, శ్రీరాముడని చెబుతూ ఉంటారు. సినిమా నటుడు కాబట్టి ఎన్టీఆర్ గురించి ఇప్పటికీ ప్రజలు…

Read More