డిడ్ ఏ మిస్టేక్!

తప్పు చేశావయ్యా ! ఆపాలనుకున్నావు! అలంకరణలు తొలగించావు! సిగ్గుగా లేదు.. ఇంత చిల్లరగా ప్రవర్తించటానికి !? ఒక రాజకీయపార్టీ..ప్రతి సంవత్సరం ..వ్యవస్ధాపక అధ్యక్షుడి జన్మదినం కలిసొచ్చే రోజున..మహానాడు జరుపుకుంటారు! అదొక వేడుక..చర్చా వేదిక! కార్యకర్తలే పునాది ! నాలుగుదశాబ్దాల చరిత్ర! తెలుగు వారి భావోద్వేగ బంధం! ఆత్మగౌరవ నినాదం! వారిని అడ్డుకోగలననుకున్నావా!? ఆపే శక్తి ఉందనుకున్నావా!? వంకర బుద్ది..బయటపడటం కాకపోతే సాధించింది ఏమిటి!? మీ వికారపు..పైత్యకారి పనుల వల్ల..రెట్టించిన ఉత్సాహం తో పాల్గొంటున్నారు. ఈ మూడేళ్ళ నిర్వాకం…

Read More

సామాజిక న్యాయభేరి ఎన్నికల భేరీనా!

అప్పుడే వైసిపికి శ్రీరస్తు..శుభమస్తు అట! సామాజిక న్యాయభేరి.. నిజానికి ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భేరి.. జగన్ పార్టీ 2024 మార్చి ..ఏప్రిల్ నెలల వరకు ఆగేట్టు లేదు.ఈలోగానే ఎన్నికలకు వెళ్ళడం ఇప్పుడు తథ్యంగా అనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలంటే సాధారణంగా వాస్తవ షెడ్యూల్ కంటే అయిదారు నెలల ముందు అని భావిస్తారు.కానీ వైసిపి అధినేత అంతకంటే చాలా ముందుగా..అంటే వచ్చే ఏడాది మార్చి నెలలోనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.దానికి నాందే నేటి నుంచి…

Read More

ఐఎస్ బి.. చంద్రబాబు విజన్ ఫలితమే

పోటీ ప్రపంచంలో ఏ దేశానికైనా,రాష్ట్రాలకైనా పెట్టుబడులు, ప్రతిష్టాత్మక సంస్థలు ఊరికే నడుచుకొంటూ రావు. అందుకు అధికారంలో ఉన్న వారి చొరవ, కృషి, పట్టుదల, కార్యాచరణ తోడవ్వాలి. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగి నేడు ద్విదశాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న హైదరాబాద్ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్ బి) ఏర్పాటు వెనుక ఓ నాయకుడి అసాధారణ పట్టుదల, అసమాన కృషి, దూరదృష్టి ఉన్నాయి. ఆయనెవరో కాదు.. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా…

Read More

అమలాపురం ఘటన దేనికి నిదర్శనం?

– కాపులమీద నింద మోపే కుట్ర జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా ప్రకటన చేసి ఆయనకి ఇష్టంగా, రాజకీయంగా అవసరం అనుకున్న , పేర్లను జిల్లాలకు పెట్టారు . కొన్ని జిల్లాలకు పేర్ల మీద వ్యతిరేకత ఉన్నా వాటిని సైతం లెక్కచేయకుండా పేర్లు పెట్టారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొంత భాగాన్ని అమలాపురం ప్రాంతాన్ని కోనసీమ జిల్లాగా ప్రకటించారు. సంతోషం. జిల్లాగా ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సిపి కి సంబంధించిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, స్థానిక యువకులు…

Read More

కోనసీమ -అంబేద్కర్ -ప్రభుత్వం!

తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగమైన కోనసీమ ను ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించినప్పుడు ; సంతోషించని కోనసీమ వాసి కనపడలేదు. అది కోనసీమ వాసులకు ఓ చిరకాల స్వప్నం. గోదావరి పాయ -గౌతమీ పై- యానాం – ఎదుర్లంక బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు కోనసీమ వాసులు జిల్లా కేంద్రమైన కాకినాడకు రాకపోకలు సాగించాలంటే ….రావులపాలెం , మండపేట , రామచంద్రపురం మీదుగా వెళ్లి రావలసి వచ్చేది. మూడు గంటలకు పైబడి రోడ్ ప్రయాణం . అందుకే ,…

Read More

ఈయనొక్కడే.. ‘వై..’సిపి..?

అది వైఎస్సార్ సిపి.. అక్కడ అందరూ ‘ఎస్సార్’ సిపి.. ఈయనొక్కడే ‘వై..’సిపి..? ప్రతి తప్పును ప్రశ్నించడమే.. ప్రతి ముప్పును ఎదుర్కోడమే!! అధినేతేమో ప్రీఫిక్స్.. ఆయనేం చేసినా సాయన్న లాజిక్స్.. సజ్జలేమో గ్రాఫిక్స్.. మొత్తంగా టీమంతా మ్యాచ్ ఫిక్స్..! ఇలాంటి ఓ బృందంలో ఆడ్ మన్ ఔట్.. అడుగుతూనే ఉంటాడు.. అది నో డౌట్.. స్వపక్షంలోనే విపక్షం.. ప్రశ్నించేటప్పుడు ప్రతిపక్షం ఎల్లప్పుడూ ప్రజల పక్షం! తానేమో నిప్పు.. ఎప్పుడూ సభలో తనకు రాలేదంటాడు విప్పు.. అయినా..మా పార్టీలో నిజం…

Read More

జాతిరత్నమై భారతరత్నమయ్యాడు..!

భారత రాజకీయాల్లో అనుకోని అతిథి.. అమ్మ..నాన్న..తమ్ముడిలా బలవంతపు మరణాన్ని బహుమానంగా ఇచ్చింది పాడు విధి.. లంకకు చేసిన మేలే కర్ర పామై కరిచిన చందమై ప్రపంచంలోనే అత్యంత హేయమైన తీవ్రవాదం మానవ బాంబు విధ్వంసానికి బలయ్యాడు అందగాడు రాజీవుడు..హతవిధీ..! ఇందిరమ్మ సంజయ రాయబారం విఫలం కాగా ఇష్టపడి సోనియమ్మను చేసుకున్న డూన్ స్కూల్ అబ్బాయి ఇష్టం లేని మనువుగా రాజకీయ ప్రవేశం.. అదే అయింది అతగాడికి ప్రాయోపవేశం…! వృత్తి విమాన చోదన ప్రవృత్తి సాహసాల చేదన.. అమ్మానాన్న…

Read More

కమ్మని పలుకులు

అగ్ర దేశాధ్యక్షుల వారికి.. ప్రపంచాన్ని నాశనం చేయడానికే మీ తెలివి తేటలన్నీ.. ఖర్చు చేసేస్తే ఎలా..?!! మీ మనశ్శాంతిని కాపాడుకోవటం కోసం.. కొంచెం అయినా మిగుల్చుకోండి మిత్రమా! ఆ బూడిదైపోయిన ప్రపంచంలో.. మీరు మాత్రం ఏం చేస్తారు.. ఆ బూడిద లో మీరు కూడా భాగమైపోతారు కదా! ఎవరైనా కొంచెం చెప్పండయ్యా! గుట్టు విప్పండయ్యా! ఆ మానసిక రోగుల్ని గద్దె దించడయ్యా – కర్షక పుత్రః‌కమ్మని మిత్రః‌

Read More

నారాయణ..నారాయణ..!

మాజీ మంత్రి నారాయణ అరెస్టు కేసు.. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టయింది…అలాగే తలపాగా చుట్టడం చేతగాక తల వంకర చందం కూడా ఇదేనూ..తెలుగుదేశంపై కక్ష సాధింపు.. అచ్చెన్నాయుడు.. నారాయణ తదితర నేతల అరెస్టుల పరంపరతో విపక్షాన్ని అప్రదిష్ట పాల్జేయడం.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడం..వెనక ఇత్యాది కారణాలు ఏవైనా ఉండనీ గాక..ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం..పెద్దల ఒత్తిడితో పోలీసుల తొందరపాటు.. ఇలాంటి వ్యవహారాల వల్ల..ఇప్పుడేమైంది.. సర్కారు పరువే గోవిందా.. టెన్త్…

Read More

ఆంజనేయ కుమార్ ఐపిఎస్..ఇతను మామూలోడు కాదు సామీ!

– యుపీలో ఆజం ఖాన్ పీఛమణిచిన మొనగాడు ఇది సినిమా కథ కాదు. సినిమాల్లో చూపిస్తున్నట్లే నిజంగా జరిగింది.ఉత్తరప్రదేశ్ లో ఆజామ్‌ ఖాన్ మరియు యోగి ఆదిత్యనాథ్ మధ్య పోటీ అందరికీ తెలిసిందే. యోగి అతన్ని జైలుకు పంపాడు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అజామ్‌ను మోకాళ్ల మీదకు తెచ్చింది ధైర్యమైన ఆఫీసర్ ఆంజనేయ కుమార్ అని. అతన్నే రాంపూర్ ప్రజలు సింగం అని పిలుస్తారు. ఆంజనేయ కుమార్ యుపిలో మౌలో జన్మించారు. అతని…

Read More