ఉస్మానియా ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్,సిటీ స్కాన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.ఇప్పటికే రెండు సిటీ స్కాన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య మూడుకు పెరిగింది.రాష్ట్రవ్యాప్తంగా మరో 4 క్యాథ్ ల్యాబ్ లు త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఆదిలాబాద్,వరంగల్, ఖమ్మం, గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి తెస్తున్నాం.50 పడకల icu బెడ్స్,కొత్త వెంటిలేటర్స్ త్వరలో ఉస్మానియాలో అందుబాటులోకి వస్తాయి.ఉస్మానియా లో సానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించాము.ఉస్మానియా లో కొత్త మార్చురీ 5 కోట్ల తో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్చురీలను ఆధునికరిస్తున్నాం.జనవరి1న మళ్ళీ ఉస్మానియాలో పర్యటిస్తాను..దవాఖానలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచాలి.ఉస్మానియా కు nabc అక్రిడిటేషన్ కోసం వెళ్తున్నాం.ఉస్మానియా బిల్డింగ్ పై కోర్ట్ కేసు తరవాత త్వరగా నిర్ణయం తీసుకుంటాం.పేషేంట్స్ లకు డైట్ విషయం లో క్వాలిటీ పెంచాలని ఆదేశించాము.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై…
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించుకున్నాం.ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ అభివృద్ధి టీఆరెస్ తో సాధ్యం అని నిరూపించారు..ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు.