Suryaa.co.in

Telangana

కాళేళ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపొచ్చు

సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
కేసిఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందన్న కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి ప్రకటనపై స్పందించిన సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు
కిషన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు సూచన

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదు. కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు. కాళేశ్వరానికి కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే అనుమతులిచ్చింది. అందుకే కేంద్రమే సీబీఐ విచారణ కోరవచ్చు. అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణ కోరవచ్చు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. సీబీఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే, అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం.

LEAVE A RESPONSE