Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్యకేసులో అనుమానం ఉండబట్టే జగన్ ఇంటిని సోదా చేస్తున్నారు

– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ పై సీబీఐకి అనుమానం ఉండబట్టే పులివెందులలోని జగన్ ఇంటిని సర్వే చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొ్న్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. . జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వివేకా హత్యకేసు ఓ కొలిక్కిరాదు. జగన్ పాత్ర లేకుండా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు వివేకాను హత్య చేయించే ధైర్యం చేయరు. సీబీఐ మీదే కేసు పెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది.

వివేకా హత్యకు తొలుత సీబీఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. ఆ తరువాత వద్దన్నారు. సిట్ వన్ వేశారు అదేమైందో ఎవరికీ తెలియదు. సిట్ 2 వేసి అధికారులను మార్చారు. ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడుపై వివేకానందరెడ్డి హత్య కేసును నెట్టి పబ్బం గడుపుకున్నారు. ఇన్ని రోజులుగా జగన్ బెయిల్ పై ఉండటం దుర్మార్గపు చర్య. జగన్ సీబీఐనే బెదిరించడం ఎంతవరకు సమంజసం? అనేక కేసుల్లో ఇరుక్కొని ఉన్న వ్యక్తి ఏపీకి సీఎం కావడం మాయని మచ్చ. జగన్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ప్రతి శక్రవారం కోర్టు మెట్లు ఎక్కాల్సివుంది. 8సంవత్సరాలపాటు బెయిల్ పై ఉండటం జగన్ యుక్తులు, కుయుక్తులు తెలుస్తున్నాయి.

బాబాయి వివేకాది గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారు. జగన్ కు ఏమాత్రం నైతిక విలువలు లేవు. ముఖ్యమంత్రి పదవికే మచ్చ తెచ్చారు. అనుమానం ఉన్నచోట్లే వాచ్ డాగ్ లు సంచరిస్తాయి. అలాగే జగన్ పై సీబీఐకి అనుమానం ఉంది కాబట్టి సర్వే చేస్తు్న్నారు. జగన్ కు పదవీకాంక్ష అధికం. తండ్రి శవానికి దహనసంస్కారాలు జరగకముందే సీఎం కుర్చీ కోసం సంతకాలు చేయించారు. జగన్ ను అరెస్టు చేసి ఎంక్వైరీ చేయకపోతే వివేకా కుమార్తె సునీతకు న్యాయం జరగదు. జగన్ బెయిల్ ని రద్దు చేయించి కష్టడీలోకి తీసుకొని సీబీఐ ఎంక్వైరీ చేయాలి. సీబీఐ అధికారులు జాగ్రత్త వహించాలి. ఆయన చేత రాజీనామా చేయించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.

LEAVE A RESPONSE