గుంటూరు : ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ కస్టమ్స్ ( సిబిఐసి ), ఆంధ్రప్రదేశ్ యూనిట్ 25 మందితొ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గురువారం గుంటూరు రింగ్ రోడ్ లోని కస్టమ్స్, జిఎస్టీ అప్పీల్స్ కార్యాలయంలో పెన్షనర్ల సంఘం రాష్ట్రస్థాయి ఎన్నిక మరియు సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి కి గుంటూరుకు చెందిన టి. వివేకానంద ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శి గా విజయవాడకు చెందిన గద్దె తిలక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం. దేవరాజన్ (తిరుపతి), బి. రాజేశ్వరరావు (గుంటూరు), ఎ. సత్యనారాయణ (రాజమండ్రి), పర్వతనేని ప్రసాద్ (విజయవాడ) ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శి పదవికి పి.వి.సత్యనారాయణ (గుంటూరు), పి. భీమ్ ప్రసాద్ (ఏలూరు), కె. వి. అప్పలాచార్యులు (కాకినాడ), పివిఎ నరసింహం (వైజాగ్) ఎన్నికయ్యారు. కోశాధికారి గా పి. కోటేశ్వరరావు (గుంటూరు), సిజిహెచ్ఎస్ ఎ. పి కొ-ఆర్డినేటర్ గా గుమ్మడి సీతారామయ్య చౌదరి (గుంటూరు), విజయవాడ కో- ఆర్డినేటర్ గా పి. భాగ్యరావు (విజయవాడ), మహిళా రిప్రెజెంటేటివ్ గా కె. సాంబ్రాజ్యం (గుంటూరు) పదవులు దక్కించుకున్నారు.
సర్కిల్ సెక్రటరీ లుగా గుంటూరుకు ఎన్. ఎస్. నగేష్ బాబు, విజయవాడకు పి. భాగ్యరావు, ఏలూరుకు ఎస్.కె. హుస్సేన్, కాకినాడకు టి. వెంకట్రావు, విశాఖపట్నంకు ఎం. వినోద్ కుమార్, నెల్లూరుకు ఇక్రముల్లా షా, తిరుపతికు ఇనయతుల్లా ఎన్నికయ్యారు. సంఘం గౌరవాధ్యక్షులుగా సెంట్రల్ ఎక్స్యెజ్ శాఖ విశ్రాంత చీఫ్ కమిషనర్ సి.పి.రావు, గౌరవ సలహాదారులుగా ఐ ఆర్ ఎస్ క్యాడర్ కు చెందిన విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్లు బి. సీతారామయ్య, పి.వి. రమణ మూర్తి, నర్రా వెంకటేశ్వర్లు ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికల అధికారులుగా జిఎస్టీ సూపరింటెండెంట్లు కె.పి.సాగర్, ఎం. గిరిబాబు వ్యహరించారు. నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు పనిచేస్తుంది. సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్, విశ్రాంత చీఫ్ కమిషనర్ బి. హరే రామ్, అఖిల భారత కస్టమ్స్, జిఎస్టీ ఉద్యోగ సంఘనాయకులు ఎం. నాగరాజు, కె. యుగంధర్, బి. నవీన్ రాజు, సూర్యదేవర రమేష్ బాబు, గాదె శ్రీనివాసరెడ్డి తదితరులు నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.