Suryaa.co.in

Features

ఈ ఫోను.. కుమ్మేసింది పోనుపోను..

గుడుగుడుమంటూ
గోలెడతాడు..
హాల్లో ఆంటూ మొదలెడతాడు..
ఎక్కడ ఉన్నా ఎవ్వరినైనా
పలకరించి కలుపుతాడు..

బూచాడమ్మా బూచాడు
బుల్లిపెట్టెలో ఉన్నాడు..
ఆ బుల్లి పెట్టెను కనిపెట్టిన
గ్రహంబెల్ పుట్టినరోజు
దునియాలో హల్లో మీద బతికే జీవులందరికీ
పండగరోజే మరి..!

ఫోను అలా పోనుపోను
తీగల మీద నడిచి
లోకల్..ట్రంకాల్..
లైటినింగ్ కాల్..
ఎస్టీడీ..ఐఎస్డి..
ఇలా దేశాలు..దశలు దాటి
బెల్ బిడ్డ
ఇప్పుడయింది మొబైల్..
ఇంటిలోని దేవత..
జేబులోని భద్రత..,!

ఆకతాయిగా.. కాకతాళీయంగా
జరిగింది కాదది..
బెల్ అవసరం..
ఒక కుర్రాడిని
శాస్త్రవేత్తగా..పరిశోధకుడిగా
మార్చిన కష్టం..
తన తల్లికి జరిగిన నష్టం..!

అమ్మకు వినికిడి శక్తి లోపం
బిడ్డ బెల్ అనుకుని
అయ్యో పాపమని..
అది కానే కాకూడదు
శాపమని..
అమ్మతో మాటాడే
ప్రయత్నాలు..
అవి రోజూ వినూత్నాలు..
grahembhell
పోగా పోగా తీగెల్లో
కదిలే మాటలు..
దాని పేరే ఫోను..
ఇంటింటా ట్రింగు ట్రింగు
ఇప్పుడేమో రకానికో రింగు
ఈ మొత్తం సంబరానికి
గ్రహం బెల్లే సరంగు…!

ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE