Suryaa.co.in

Family

మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు..చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు

చేతులు ఉన్నందుకు దానం చేయాలి. చెవులున్నందుకు మంచి మాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాటలు మాట్లాడాలి. అందుకే ఒక మంచిమాట తలకు కీరిటాన్ని పెడితె, ఒక చెడు మాట తలను తీసివేస్తుంది. ఒక మంచి మాట తృప్తి ని కలిగిస్తే, ఒక చెడు మాట మనసును కలచివేసి ఆ భాధను జీవితాంతం గుర్తుండేలా చేస్తుంది.

సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది. సహనం జీవితాన్ని నిలబెడుతుంది. వీచే పరిమళాలాను బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు, మనం మాట్లాడే మాటలను బట్టి ఇతరులకు మనపై గౌరవం ఏర్పడుతుంది. నాలుక మీది తేనెను చూసి మోసపోకు, హృదయం లోని విషాన్ని గ్రహించు. చెడు అలవాట్లు ఉన్న వ్యక్తితో కలిసి తిరిగిన ఏమి కాదు, కానీ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తన అవసరం కోసం వాడుకునే వ్యక్తితో మాత్రం చాలా దూరంగా ఉండాలి. లేకపోతే మీ సమయం, ధనం వృధా అవుతాయి. ఆలోచించండి.

ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకోని మంచికోసం ఏదైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్ళం అవుతాము. బావిలో వదలబడినప్పుడు వంగిన బకెట్ మాత్రమే నీటిని తనలో నింపుకోగలదు. అలాగే ఒదిగి ఉండే తత్వం ఉన్న మనిషి జీవితం లో నిండుగా ఎదిగిపోగలడు.

ప్రతి మనిషిలో మంచి, చెడు రెండు ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు. చెడును చుసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు.
A person with much compassion is likely to be more favourable to another than a human being with little or no sympathy..

– ఏచూరి చంద్రారావు

LEAVE A RESPONSE