Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ మాజీ అధిపతి సునీల్ కుమార్ పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి

– A.I.M సంస్థ ఏనాడైనా రాష్ట్రంలో దళితులపై జగన్ రెడ్డి సాగిస్తున్న దమనకాండను ప్రశ్నించిందా?
– జగన్ మెప్పుకోసం రాజ్యాంగవిరుద్ధంగా పనిచేసిన సునీల్ కుమార్ తగినమూల్యం చెల్లించుకోబోతున్నాడు.
• సీఐడీ బాస్ గా సునీల్ కుమార్ జగన్ మెప్పుకోసమే, పనిగట్టుకొని మరీ టీడీపీనేతల్ని హింసించాడు. వైసీపీఎంపీ రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసి, ఆదృశ్యాలను ఫోన్లో జగన్ కు చూపించాడు.
• యువగళం పాదయాత్రలో లోకేశ్ పై, ఇప్పటివరకు ప్రతి 31కిలోమీటర్లకు ఒక కేసు పెట్టారు. పెట్టిన 12కేసుల్లో 9 పోలీసులు పెట్టినవే.
• ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్ ను కేసులు ఆపలేవు. జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం అంతుతేల్చేవరకు లోకేశ్ విశ్రమించడు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

ఏపీ సీఐడీ అధిపతిగా పనిచేసిన పీ.వీ.సునీల్ కుమార్ వ్యవహారశైలి, అవినీతిబాగోతంపై కేంద్రం విచారణకు ఆదేశించడం శుభపరిణామమని, అతను పాలకుల మెప్పుకోసం ప్రతిపక్ష నేతల్ని హింసించిన విధానం, రాష్ట్రంలో పౌరులహక్కులు మంటగలిపిన తీరుపై, టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదుపై కేంద్రప్రభుత్వం స్పందనను స్వాగతిస్తున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు , మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…

“సీఐడీ అధిపతిగా ఉన్న సునీల్ కుమార్, చిన్నపిల్లలు మొదలు, 75ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిపై తప్పుడుకేసులు పెట్టి హింసించాడు. అమరావతిలో భూముల కుంభకోణం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో టీడీపీఅధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారాయణపై కూడా సునీల్ కుమార్ తప్పుడుకేసులు పెట్టాడు. చివరకు ఆ వ్యవహారంలో సీఐడీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం పనిగట్టుకొనిమరీ టీడీపీనేతల్ని వేధించాడు. అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రలను దారుణంగా హింసించాడు. అర్థరాత్రి దొంగల్లా సీఐడీ సిబ్బంది ప్రతిపక్షనేతల ఇళ్లలోకి చొరబడే దుస్థితిని సునీల్ కుమార్ కల్పించా డు. పీ.వీ.సునీల్ కుమార్ తనను కస్టోడియల్ టార్చర్ కు గురిచేశాడని, దానిపై విచారణ జరపాలని వైసీపీఎంపీ రఘురామకృ ష్ణరాజు కూడా ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదుచేశారు. రఘురామకృష్ణరాజుని సీఐడీ పోలీసులు కొడుతుంటే, సునీల్ కుమార్ ఆదృశ్యాలను ఫోన్ ద్వారా జగన్ రెడ్డికి చూపించాడని కూడా చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే సునీల్ కుమార్ దురాగతాలకు అంతేలేదు.

సునీల్ కుమార్ A.I.M సంస్థ, ఏనాడైనా జగన్ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దారుణాల్ని ప్రశ్నించిందా?
అంబేద్కర్ ఇండియా మిషన్ (A.I.M) పేరుతో ఒకసంస్థను స్థాపించిన సునీల్ కుమార్, దాని ముసుగులో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి, వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. మహానుభావుడి పేరుతో పెట్టిన సంస్థను, తనస్వార్థానికి వాడుకున్న సునీల్ కుమార్ తీరు పై కేంద్రం విచారణకు ఆదేశించడం నిజంగా స్వాగతించాల్సిందే. దళితుడైన సునీల్ కుమార్ .. తన సంస్థద్వారా ఏనాడు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాల్ని ఖండించింది లేదు. A.I.M సంస్థను సునీల్ కుమార్ తనస్వార్థంకోసమే స్థాపించాడు. కాబట్టే ఆసంస్థ ఏనా డూ జగన్ నేత్రత్వంలో దళితులపై జరుగుతున్నదాడులు, హత్యలు, ఆత్మహత్యలు, అకృ త్యాల్ని ప్రశ్నించలేకపోయింది. ఆఖరికి సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ ప్రభుత్వం దారిమళ్లించినా ఆ సంస్థలో చలనంలేదు. ఆ సంస్థ మొత్తం జగన్ కోసం, అతనిప్రభుత్వం కోసమే పనిచేసిందని ఘంటాపథంగా చెప్పగలం.

జగన్ మెప్పుకోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన సునీల్ కుమార్ పై కేంద్రం కఠినచర్యలు తీసుకోవాలి
సునీల్ కుమార్ వ్యవహరశైలి గురించి తెలిసే జగన్ అతన్ని సీఐడీకి అధిపతినిచేశాడు. దళిత ఐపీఎస్ ను తన రాజకీయకుట్రలో భాగస్వామినిచేసి, తనఅవసరాలకు ముఖ్యమంత్రి వాడు కున్నాడు. సునీల్ కుమార్ కూడా జగన్ మెప్పుకోసం చట్టవిరుద్ధంగా, రాజ్యాంగాన్ని తుంగ లో తొక్కిమరీ పనిచేశాడు. అంబేద్కర్ పేరుతో సంస్థను స్థాపించిన సునీల్ కుమార్..చివరకు ఆ మహానీయుడి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. అలాంటివ్యక్తిపై ఏపీప్రభు త్వం కఠినంగా వ్యవహరించాలని, కేంద్రప్రభుత్వంకూడా తగినచర్యలు తీసుకోవాలని కోరుతు న్నాం. సునీల్ కుమార్ పై కేంద్రం తీసుకోమన్న చర్యలకు సంబంధించి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఆదేశాలు పంపారంటున్నారు. ఆయన ఎన్నిరోజులకు సునీల్ కుమార్ పై చర్యలు తీసుకుంటాడో చూడాలి.

ఎన్నికేసులు పెట్టినా లోకేశ్ ను ఆపలేరు.. జగన్, అతనిప్రభుత్వం అంతు తేల్చే వరకు లోకేశ్ విశ్రమించడు
యువగళం పాదయాత్ర మొదలైనప్పటినుంచీ వైసీపీప్రభుత్వానికి, జగన్ కు చెమటలు కారు తున్నాయి. లోకేశ్ ఇప్పటివరకు 400 కిలోమీటర్లు నడిచారు. ప్రతి 31కిలోమీటర్లకు ఆయన పై ఒకకేసు పెట్టింది ఈ ప్రభుత్వం. మొత్తం ఇప్పటికీ లోకేశ్ పై ఈ ప్రభుత్వం 12కేసులు పెడితే వాటిలో 9కేసులు పోలీసులుపెడితే, ఒకకేసు వీఆర్వో పెట్టారు. పోలీసులు ఇంతగా ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారో, ఎందుకు ఇంతటిస్వామిభక్తి ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. ప్రభుత్వం లోకేశ్, టీడీపీనేతలపై పెడుతున్న తప్పుడుకేసులకు ఎస్సీ,ఎస్టీ పోలీసులే ఎక్కువగా బలవుతున్నారు. మొన్నగన్నవరంలో అలానే పాలకుల దుర్మార్గానికి అక్కడి సీ ఐ కనకారావు బలయ్యాడు. యువగళం యాత్రలో కూడా లోకేశ్ పై పెట్టిన తప్పుడుకేసుల్లో పోలీసులే ప్రధానపాత్రధారులు, సూత్రధారులుగా మిగులుతున్నారు. జగన్ రెడ్డి.. లోకేశ్ పై ఎన్నితప్పుడుకేసులు పెట్టినా, ఆయన్ని అపలేడు. ఆయన వెంట యువత పోటెత్తుతోంది. ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్ ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంతుతేల్చేవరకు విశ్రమించడు.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE