బ్రదర్ జగన్… భయం మా బయోడేటాలో లేదు !

Spread the love

-చెవిరెడ్డి రూ. 1000 కోట్లు దొబ్బేసి మళ్లీ చీర, స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు
-వైసీపీ నేతల అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తా
-జగన్ పాదయాత్రలో 9 మంది చనిపోయారు
-చంద్రగిరి నియోజకవర్గం పాకాల గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన పాకాల ప్రజలకు ధన్యవాదాలు, మీ ప్రేమాభిమానాలు ఎన్నటికి మర్చిపోలేను. జగన్ పాదయాత్రకు చంద్రబాబు నాయుడు అన్ని అనుమతులిచ్చారు, కానీ జగన్ నాకు భయపడి మైక్ లాక్కున్నారు. నా మైక్ లాక్కోగలరేమో కానీ నా గొంతు నొక్క లేరు, నాకు ఈ గొంతు ఇచ్చింది ఎన్టీఆర్ , నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడుతా. పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నాపై 4 కేసులు పెట్టారు, నా వాహనాలు సీజ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేది లేదు, ప్రజల కోసం దేనికైనా సిద్దం.

యువగళం పాదయాత్రను అడ్డుకోవాలన్న కుట్రతోనే జీవో నెం. 1 తెచ్చారు. జగన్ పాదయాత్రలో 9 మంది చనిపోయారు, కానీ నాడు చంద్రబు నాయుడు జీవో 1 తీసుకురాలేదు. వైసీపీ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగులకు జీతాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, పోలీసు సోదరులకు సరెండర్ లీవ్ లు, టీఏలు, డీఎలు లేవు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్సీ, బీసీ మహిళలకు ఫించన్, యువతకు 2.30 లక్షల ఉద్యోగాలిస్తానన్న జగన్ హామీలపై ప్రశ్నిస్తే నేటీకీ సమాధానం చెప్పలేదంటే మౌనమే అర్దంగీకారమా? జగన్ ఇచ్చిన హామీలపై నేను మాట్లాడితే నాపై కేసులు పెడతారా? ఎంత మందిపై కేసులు పెడతారు?మీపై అక్రమ కేసులు పెడితే చెప్పండి మిమ్మల్ని కాపాడేందుకు స్వయంగా నేనే వస్తా. బ్రదర్ జగన్ భయం మా బయోడేటాలో లేదు.

చంద్రబాబు ఒప్పుకోకపోయినా సరే నేను మాత్రం వైసీపీ నేతల అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తా. చెవిరెడ్డి రెండు సార్లు గెలిపించిన చంద్రగిరి ప్రజలకు స్వీట్ బాక్స్, చీర తప్ప ఇంకేమిచ్చారు?10 ఏళ్ల నుంచి చంద్రగిరి ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? 10 ఏళ్లలో చెవిరెడ్డి ఒక పరిశ్రమ అయినా తెచ్చారా? యువతకు ఉద్యోగాలిచ్చారా? ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? పులివర్తి నానిని ఆశీర్వదించండి అభివృద్ది అంటే ఏంటో చేసి చూపించే భాధ్యత నేను తీసుకుంటా. చెవిరెడ్డి రూ. 1000 కోట్లు దొబ్బేసి మళ్లీ చీర, స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు, చంద్రగిరి ప్రజలు మరోసారి నమ్మి మోసపోవద్దు.

Leave a Reply