-కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంది
-గాదంకిలో యువనేత లోకేష్ ను కలిసిన బలిజ సామాజికవర్గీయులు
-సమస్యలపై లోకేష్ కు వినతిపత్రం సమర్పించిన చంద్రగిరి మండల బలిజలు
గత టిడిపి ప్రభుత్వం కాపు,బలిజ,తెలగ,ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ప్రస్తుత ప్రభుత్వం అవకాశం ఉన్నా మాకు రిజర్వేషన్ అమలుచేయడం లేదు. కాపు, బలిజ కార్పొరేషన్ ను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది.చంద్రగిరి రాయలకోట దగ్గర రాయలవారి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీవిద్య, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి ఆదుకోండి.గత ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బలిజలతోపాటు వివిధ కులవృత్తు వారికి పరికరాలు అందజేసి ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆదరణ పథకాన్ని రద్దుచేసి తీరని అన్యాయం చేసింది.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆదరణ పథకాన్ని పునరుద్దరించండి.గత ప్రభుత్వం వివిధ కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటుచేసి నిధులిచ్చి ఆదుకుంది.
ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఒక్కరూపాయి నిధులు కేటాయించలేదు. పాలకవర్గాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. గతంలో బలిజలకు ఆర్థిక చేయూత నివ్వడానికి సబ్సిడీ, మార్జిన్ మనీతో కూడిన రుణాలను మంజూరుచేయగా, చివరలో ఎన్నికలు రావడంతో బ్యాంకర్లు సహకరించలేదు.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకర్లతో సంబంధం లేకుండా కార్పొరేషన్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించి రుణాలు మంజూరుచేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపు, బలిజ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేసింది. బలిజ,కాపులకు నిర్లక్ష్యం చేయడమేగాక వారిని వేధించడమే పనిగా పెట్టుకుంది.గతం ప్రభుత్వం చేపట్టిన కాపు, బలిజ భవనాల నిర్మాణాన్ని నిలిపివేశారు. స్వయం ఉపాధి రుణాలు లేకుండా చేశారు, కౌలు రైతులకు భరోసా లేకుండా చేశారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంది.ఎపిలోనే మొట్టమొదటిసారిగా కాపు,బలిజ,తెలగ, ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటుచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక బలిజ కాపుల రాజకీయ, ఆర్థిక, సామాజికాభివృద్ధికి కృషిచేస్తాం.