Suryaa.co.in

Entertainment

వినరావా నా కథా..!

మామా..చందమామా…
వినారావా నా కథ..
నిజమే..
ఈ సంబరాల రాంబాబుది
చిత్రమైన వ్యధ..
దిలీప్ కుమార్ స్టైల్..
అందమైన స్మైల్..
వ్యసనం ముంచేసింది..
బ్రతుకు తుంచేసింది..!

మట్టిలో మాణిక్యం..
ఈ సత్తికాలపు సత్తెయ్య…
శారద అనే బల్లెమ్మనే
ప్రేమలో పడేసిన బుల్లోడు..
నిజానికి వీరి పెళ్లి నాటికి
శారద ఊర్వసి..
మేడపైని చిలకమ్మ..
నింగిలోని బల్లెమ్మ..
కాని చలం చేయించి రాయబారం..
వేయించి ప్రేమ తులాభారం
కట్టేసాడు తాళి..
పెళ్లి పెటాకులై
పాలకొండ బుల్లోడు
కొన్నాళ్ళకి ఓటి కుండైపాయె!

మనం బాగుంటే అన్నీ బాగుంటాయన్న మాట
చలం జీవితం..
రింజిం రింజిమ్
హైదరబాద్..
రిక్షావాలా జిందాబాద్..
ఓ వెలుగు వెలిగిన
చైర్మన్ చలమయ్య..
వ్యసనం పట్టి మొహం ఉబ్బి
సినిమాలు ఫెయిలై…
రాధాకృష్ణ నాటికి
చివరికొచ్చి..చేవ చచ్చి
లంబాడోళ్ళ రాందాసుతో
నిర్మాతగానూ కొట్టేసి గంట
తన కెరీరుకు తానే తవ్వుకుని గుంట..
ఆంధ్రా దిలీప్..
చెప్పేశాడు ఇదే రోజున పేకప్!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE