వినాయక మండపాలకు చలాన్లు వసూలు చేయటం లేదు

– రుసుము – చందాలు తీసుకొన్న లేక ప్రేరేపించబడిన వారిపై చట్టపరమైన చర్యలు
– దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్

వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ స్పందిస్తూ మండపాలు ఏర్పాటుకు ఎటువంటి రుసువులు వసూలు చేయడం లేదని, సంబంధిత మండపాలు ఏర్పాటు చేసేందుకు స్థానిక పోలీస్,రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. చట్టపరంగా తీసుకోవలసిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలన్నారు.

అది మినహాయించి ఏ రకమైన రుసుము గాని చందాలు గాని తీసుకొన్న లేక ప్రేరేపించబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ హెచ్చరించారు.

ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు భక్తులు నమ్మవద్దని వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అన్నారు. ఎక్కడైనా మండపాలకు రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తెలిపారు.

Leave a Reply