Suryaa.co.in

Andhra Pradesh Telangana

చంద్రబాబు- భువనేశ్వరి వేలాది మంది విద్యార్థులకు జీవితం ఇచ్చారు

– మంత్రి సీతక్క

మాజీ సీఎం నారా చంద్రబాబు భువనేశ్వరి వేలాది మంది విద్యార్థులకు జీవితం ఇచ్చారు. 2004 లో నా రాజకీయ జీవితం మొదలైంది. ఈ స్కూల్ తో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. నేను అనాధ పిల్లలను చంద్రబాబు నేతృత్వంలో ఈ ట్రస్ట్ లో జాయిన్ చేశాను.విద్య ను అందుకోలేని వారికి భువనేశ్వరి అవకాశం కల్పించారు.

నేను చిన్నప్పుడు ఉద్యమానికి వెళ్ళాను. కానీ తర్వాత చదువుకొని లాయర్ అయ్యాను.విద్య అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు విద్య అంటే ఒక సర్వీస్.ఎడ్యుకేషన్ చివరి వరకు ఉంటుంది.నాలెడ్జ్ ను పడి మందికీ పంచాలి.

మన జీవితం కొంతమంది కి అయిన ఉపయోగపడాలి. నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటీ ప్రజలను పంచాలి అని పనిచేస్తున్న. పోయేటప్పుడు విజ్ఞానం, సేవ, నాలెడ్జ్ మాత్రమే తీస్కొని వెళ్తాం. ఇక్కడ చదివే విద్యార్థులు అందరూ ఎన్టీఆర్ ట్రస్ట్ కు మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ సమస్య ఉంటుందో అక్కడ NTR ట్రస్ట్ ముందు ఉండి సేవలకు పాల్పడుతోంది. నా రాజకీయ జీవితం టీడీపి తో మొదలు అయింది.విద్యార్థులు అందరూ సమాజ అభివృద్ధి లో ఒక భాగం అవ్వాలి.

LEAVE A RESPONSE