వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు

ఎన్టీఆర్ జిల్లా/కంచికచర్ల : కొత్తపేట గ్రామం నందు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన అబ్బూరి శివనాగ మల్లేశ్వరరావు మరియు 10 కుటుంబాల వైసిపి నేతలను స్థానిక తెదేపా నేతలు మరియు కేశినేని ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివానాధ్ (చిన్ని) గారితో కలిసి వారిని పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య . అనంతరం గని ఆత్కూరు , చేవిటికల్లు గ్రామాలలో తెదేపా నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగినది.

తంగిరాల సౌమ్య: రాష్ట్రం బాగుపడాలనే తెలుగుదేశం పార్టీలోకి ఈ వరుస వలసలు.అరాచక వైసిపి దుర్మార్గపు పాలన నుండి బయటపడాలనే ఆలోచనతో టిడిపిలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు,గ్రామాలలో బెల్టు షాపులు పుట్టగొడుగులుగా వెలుస్తున్నాయి.. బెల్టు షాపులు ఆడపడుచుల మాంగల్యాలతో ఆడుకుంటున్నాయి.

నాసిరకం మద్యం తాగడంతో పేద,సామాన్య కుటుంబాలు అన్యాయంగా బలైపోతున్నాయిప్రకృతి సంపద ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.అక్రమ ఇసుక రవాణాకు గ్రామాలలో రోడ్లు మొత్తం నాశనమై రహదారి పొడుగునా డస్ట్ పంట పొలాలపై పడి సారవంతమైన నేలలు బీడు భూములుగా మారాయి.స్కీములు లేవు మూలపడ్డ స్కీముల రిపేర్లకు కూడా నిధులు మంజూరు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం..

వైయస్సార్ పార్టీకి నమ్మి ఓటు వేసినందుకు రైతు పంటపొలాలకు నీరు లేక చివరకు రైతు కంట కన్నీరే మిగిలింది.ఈ రోజు వైయస్సార్ పార్టీ విధానాలు ప్రజా వ్యతిరేక పనులతో విసుగెత్తి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము..

Leave a Reply