Suryaa.co.in

Andhra Pradesh

ఎక్కడ చూసినా కూడా చెత్త

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర ఐదోవరోజు కార్యక్రమంలో భాగంగా సీతమ్మ కాలనీ అంకమ్మ తల్లి గుడి వద్ద ప్రారంభమై నల్లకుంట, జూట్ మిల్ కాలనీ, రామిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్, చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవాలయం వరకు సాగింది. ఈ పాదయాత్రకు ముఖ్య అతిదులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేశారు.

బిజెపి పశ్చిమ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో స్థానిక 6వ మండలంలో విజయ సంకల్ప యాత్ర అనేపేరుతో ఇంటింటికి బిజెపి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాల కరపత్రాలని ప్రజలకు అందించే కార్యక్రమం నిర్వహించారు.

పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జయప్రకాష్ మాట్లాడుతూ స్థానికంగా ఎక్కడ చూసినా కూడా చెత్త ఎక్కడికక్కడ రోడ్లు వెంట వుంటుంది. ఈ రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ అభియాన్ క్రింద కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికి వాటిని సరిగ్గా వినియోగించకుండా దుర్వినియోగం చేసి నిర్లక్ష్యం చేయడం అనేది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమే, ఈ అపరిశుభ్రత వలన అనేక వ్యాదులు ప్రభలి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు,

ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రలో ఉన్న వైసిపి ప్రభుత్వం చేసే స్టిక్కర్ రాజకీయాల వలన నరేంద్రమోదీ జి అందిస్తున్న అనేక పథకాలకు వీళ్ళ సొంత బొమ్మలు వేసుకొని ప్రజలని ప్రక్క దారి పట్టిస్తున్నారు, ఇంకా అనేక కేంద్ర పధకాల అర్హులు వున్నా కొడా వారికి చేరనివ్వడంలేదు, దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ఇళ్ళు ఈ రాష్ట్రానికి ఇస్తే వాటిని కూడా అనేక మందికి ఇళ్ళు కూడా అందించలేని దుస్థితి ఈ రాష్ట్రంలో వున్నదని దుయ్యబట్టారు.

జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా స్థానిక వైసిపి ప్రభుత్వం వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారు , ఈ పాదయాత్ర వలన ప్రజలు నిజాలు తెలుసు కొని ఈ వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపే పరిస్థితి వచ్చింది.

ఈ పాదయాత్రలో స్థానిక 6వ మండల అధ్యక్షులు లంకా రవిశంకర్, రాష్ట్ర బిజెపి నేత కొక్కెర శ్రీనివాస్ యాదవ్, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప ప్రసాద్ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, పాలపాటి రవికుమార్, ఏలూరి లక్ష్మీ , సాయి రాధాకృష్, తిరుమలశెట్టి వెంకట రమణ నాయుడు, అనుమొలు ఎదుకొండలు గౌడ్, మంజునాధ్, అచ్యుత ప్రసాద్, మాదాల సురేష్, కత్తి మేరీ సరోజిని, రాయపూడి ఏసోబు, ఆవుల రాము, తోట శ్రీనివాస్, ధారా అంబేద్కర్, తాడువాయి రామకృష్ణ, వాణి వెంకట్, నవీన్, బాషా, వలి, తరుణ్ కుమార్, దేసు సత్యనారాయణ, జితేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు,

 

LEAVE A RESPONSE