మాదిగ జాతి నరేంద్ర మోడీ ని గుండెల్లో పెట్టుకుంటాం

-ఎంఆర్ పి ఎస్మాదిగలకు ఇచ్చిన హామీ కి కట్టుబడి ఉన్నాం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

మాదిగ జాతి యావత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని గుండెల్లో పెట్టుకుంటాం…మా జాతికి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇవ్వలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రతినిధులు బిజెపి రాష్ట్ర కార్యాలయం కు వచ్చి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తో భేటీ అయ్యారు.

మాదిగ విశ్వరూప సభలో నరేంద్ర మోడీ పాల్గొన్న విషయాలు ప్రస్తావనకు ఎం ఆర్ పి ఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తీసుకుని వచ్చారు.ఆనాటి సభకు అద్యక్షత వహించిన విషయం ప్రస్తావిస్తూ తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేశామన్నారు.

మాదిగల కాలం నెరవేరితే బిజెపి స్వంత పార్టీ గా దక్షిణాది రాష్ట్రాల్లో పని చేస్తామన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మాట ఇస్తే తిరుగు ఉండదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సందర్భంగా అన్నారు.మీ సమస్యలు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దృష్టి కి తీసుకొని వెళ్తాము అని హామీ ఇచ్చారు.

మందకృష్ణ మాదిగ ఆదేశాలు ప్రకారమే బిజెపి రాష్ట్ర కార్యాలయం కు రావడం జరిగింది అని మాదిగ జాతి ప్రతినిధి లు ఈసందర్భంగా చెప్పారు.ఆంధ్రప్రదేశ్ లో మాదిగ ప్రజలు ఏఏ ప్రాంతాల్లో అధికం గా ఉన్నారన్న విషయాలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు ప్రస్తావించారు.అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరికి వినతి పత్రం సమర్పించారు
రుద్రపోగు సురేష్ మాదిగ ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్ పి ఎస్ జాతీయ అధ్యక్షుడు మహిళా నేతలు కరుణ, తబిత, వాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply