ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నూతన రిజిస్ట్రార్ ని కలిసిన ఫార్మా జేఏసీ రాష్ట్ర నాయకులు

Spread the love

అమరావతి: గుంటూరులో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ కు రిజిస్ట్రార్ గా విశాఖపట్నం కు చెందిన డాక్టర్ విలియం కేరి ని నియామకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ గా డాక్టర్ విలియం కేరి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఫార్మా జేఏసీ నాయకులు నూతనంగా నియామకమైన ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ విలియం కేరీ ని కలిసి అభినందనలు తెలిపి, ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ మరియు రేన్యువల్ ప్రక్రియలకు సంబంధించి ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఫార్మా జేఏసీ నాయకులు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు.

ఫార్మసీ కౌన్సిల్ కు ఎన్నికలు జరగకుండా ఉద్దేశపూర్వకంగా కొందరు ఏపీ హైకోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని, ఏది ఏమైనా ఫార్మసీ కౌన్సిల్ కు ఏప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఫార్మసీ చట్టం 1948 లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలనా నిర్ణయాత్మక అధికారాన్ని ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఫార్మసీ చట్టం ప్రకారం రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ కు ఎన్నికలు నిర్వహించి రాజ్యాంగబద్ధంగా పూర్తిస్థాయిలో కౌన్సిల్ నీ ఏర్పాటు చేసి నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయమని, ఫార్మసీ చట్టం 1948 ప్రకారం ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ ను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కొరకు తెలంగాణా రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ తరహాలో వెంటనే ఫార్మసీ ఇన్స్పెక్టర్లను నియామకం చేయాలని, గత కొన్నేళ్లుగా పెండింగుల్లో ఉన్న ఫార్మసిస్టుల యొక్క రిజిస్ట్రేషన్లు మరియు రెన్యువల్ లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరగా.. సమాధానంగా మూడు నెలల లోగా పెండింగ్లో ఉన్న అన్ని ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల రెన్యువల్ ప్రక్రియలను పూర్తి చేస్తానని, ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని, ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ స్పష్టమైన హామీ ఇచ్చారని సమాచారం .

ఈ కార్యక్రమంలో ఏపీ ఫార్మా జెసి రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ సింగనమల సుమన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నాల ప్రకాశరావు, కోట సుబ్బారావు, రాష్ట్ర కన్వీనర్ ఆదిరెడ్డి, జేఏసీ మీడియా కోఆర్డినేటర్ ఫార్మా గైడ్ రాధా కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీవి సుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా ఇంచార్జ్ చక్రధర్, సునీంద్ర, వేణు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఫోరం ఇంఛార్జి ప్రశాంతి, రాష్ట్ర మహిళా విభాగం ఇంఛార్జి సి. సూర్య సావర్ని, తారకేశ్వర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply