మీరు చేయమంటేనే ఆ పని చేశా

Spread the love

– నిజం ఒప్పుకోవడం నేను చేసిన తప్పా?
– సునీతమ్మ ,సీబీఐ వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు
– డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే జీవితాంతం నేను జైల్లో ఉంటా
– వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి

నేను అప్రూవర్ గా మారినప్పుడు ఇప్పుడు విమర్శించేవారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? మీ వరకు రానంతవరకు దస్తగిరి మంచోడు..ఇప్పుడు చెడ్డోడిగా మారాడా? నిజం ఒప్పుకోవడం నేను చేసిన తప్పా? మీరు చేయమంటేనే ఆ పని చేశాను నా జీవితం బాగుపడుతుంది అని మీరు చెప్పడంతో చేశాను.మీ అరెస్టులు వచ్చిన అంతవరకు ఇలాంటివి మీకు గుర్తు రాలేదా?

సునీతమ్మ ,సీబీఐ వద్ద ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. డబ్బుకు తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. సునీతమ్మ వద్ద డబ్బులు తీసుకున్నానని ఆరోపణ చేసేవారు, ఏ అకౌంట్ నుండి డబ్బులు వేశారో కనుక్కోలేరా వాటిని కోర్టుకు చూపించలేరా? నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే జీవితాంతం నేను జైల్లో ఉంటాను. ఒకవేళ మీరు నిరూపించలేకపోతే మీ ఎంపీ పదవులకు, మీ పార్టీ పదవులకు మీరు రాజీనామా చేస్తారా?

Leave a Reply