Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధికి చిరునామా చంద్రబాబు

-‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకావిష్కరణ
-పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ సీనియర్‌ నేత, పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ రూపొందించిన ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని నేడు చంద్రబాబునాయుడుగారు తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ పుస్తకం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1995`2004 మధ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, 2014`19 మధ్య నవ్యాంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొత్తం 14 సంవత్సరాలలో వివిధ రంగాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఆయా రంగాలవారీగా అందించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మొత్తం 15 సంవత్సరాలలో నిర్వహించిన ప్రజా పోరాటాలు, ఉద్యమాలను సైతం ఈ పుస్తకంలో ప్రస్తావించారు. 2004లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చేపట్టి విస్తృత సామాజిక, సేవా కార్యక్రమాలను సైతం క్లుప్తంగా పొందుపరిచారు.

‘‘చంద్రబాబునాయుడు పేరు చెబితే ఏదైనా పథకం గుర్తుకొస్తుందా?’’ అని చౌకబారుగా విమర్శిస్తున్న వారికి.. చంద్రబాబునాయుడు ఏం చేశారో తెలియజేప్పేందుకు.. ఒక దార్శనికుడైన పాలకుడు అధికారంలో ఉంటే ప్రజలకు జరిగే మేలు ఏమిటో మరోసారి గుర్తు చేసేందుకే ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని తేవడం జరిగింది’’ అని పుస్తక రచయిత టి.డి.జనార్థన్‌ పేర్కొన్నారు.

చంద్రబాబునాయుడుప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా చరిత్రగతిని మార్చాయో అందరూ తెలుసుకోవాలని, ఆయా రంగాలలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా నిలిపిన వైనాన్ని, జాతీయ స్థాయిలో సాధించిన విజయాల్ని, సామాజిక న్యాయం చేయడానికి రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ని, లోక్‌సభ స్పీకర్‌గా జీయంసి బాలయోగి ని, శాసనసభ స్పీకర్‌గా ప్రతిభా భారతి ని ఎంపిక చేసిన ఖ్యాతి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని టి.డి. జనార్థన్‌ పేర్కొన్నారు.

‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన నారా చంద్రబాబునాయుడు రచయిత టి.డి. జనార్థన్‌ను అభినందించారు. విమర్శకుల నోటికి తాళం వేసేలా పుస్తకంలోని అంశాలు ఉన్నాయన్నారు. ఈ పుస్తక రూపకల్పనలో పాలుపంచుకున్న కాసరనేని రఘురామ్‌, విక్రమ్‌ పూల, విజయభాస్కర్‌, డిజైనర్‌ కె.శ్రీనివాస్‌, ఐకాన్స్‌ మధుసూదన్‌రాజు తదితరులను నారా చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అభినందించారు.

LEAVE A RESPONSE