– టీడీపీ అధినేత చంద్రబాబు
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయి. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.