అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే

కార్మికుల చెమట నుండి పుట్టిందే తెలుగుదేశం పార్టీ
మీ బాధలు అన్నింటిని మరచిపొండి
కార్మిక సంస్కరణలు బాబు ప్రధాన అజెండా
మహిళా శ్రామికశక్తితో భువనమ్మ మాటామంతీలో నారా భువనేశ్వరి

కార్యక్రమానికి వచ్చిన మహిళా శక్తికి నా నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు..రాజకీయ ప్రసంగాలు చేయడానికి కాదు. నేను మీలో ఒక స్త్రీగా ఆలోచించి మాత్రమే మాట్లాడతాను…మీ కష్టాలు వింటాను. మా కష్టాల్లో పాలుపంచుకునే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది.

మహిళ సొంత కాళ్లపై నిలబడడం చాలా గొప్పతనం…గౌరవం కూడా. నేను హెరిటేజ్ సంస్థను ముందుకు తీసుకెళుతున్నాను..దీనికి చంద్రబాబుగారే కారణం. నన్ను హెరిటేజ్ సంస్థకు ఎం.డీ గా చేసిన సమయంలో నేను భయపడితే, చంద్రబాబు నాతో మాట్లాడుతూ…పని నేర్చుకో..ధైర్యంగా ఉండు..ఆలోచనతో ముందుకు సాగు…నువ్వు సాధిస్తావని నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రారంభ దశలో అనేక తప్పులు దొర్లినా…టీమ్ వర్క్ తో నేడు కంపెనీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నాను.

మహిళలు ఏ పనినైనా నావల్ల కాదని అనకూడదు…మీరు ఏదైనా సాధిస్తారు..ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు. నేటి కాలంలో శ్రామిక మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నాకు తెలిసింది. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కార్మిక శక్తితోనే సాధ్యం..కార్మికుల చెమట నుండి పుట్టిందే తెలుగుదేశంపార్టీ.

శ్రామికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎన్టీఆర్ కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారు.ఇతరుల ఇంటి కలలను నిజం చేసేందుకు శ్రమించే మీరు, మీకంటూ సొంత ఇల్లు లేక, సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, బియ్యం, ఇలా అన్ని నిత్యావసరాల రేటు పెరగటంతో రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై భారం పెరిగింది. ఈ పెరిగిన రేట్ల వల్ల ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నది రోజు వారి కార్మికులే.

నాసిరకం మద్యం చాలా మందిని ఆస్పత్రి పాలు చేసింది. ఎంతోమంది చావుకి కారణం అయ్యింది. మద్యం తాగే మీ భర్త గురించి, మీ అన్న లేదా నాన్న గురించి మీరు టెన్షన్ పడుతున్నారని నేను అర్ధం చేసుకోగలను. ఇంతే కాకుండా సంపాదన కూడా పెరిగిన మద్యం ఖర్చులకే సరిపోతుంది. ఆంధ్రాలోని 77 లక్షల మంది రోజూ వారు కార్మికులు ఉన్నారని అంచనా. దాదాపు 31 శాతం మంది ప్రజలు రోజూ వారి పనులపై ఆధారపడుతున్నారు. కానీ గత ఐదేళ్ళు గా నిర్లక్ష్యానికి గురవుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగాన్ని, నిర్మాణ రంగంపై ఆధారపడిన వారిని రోడ్డున పడేసింది. వైసీపీ అనాలోచిత నూతన ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం మూడు నెలలు పూర్తిగా మూతపడింది. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం వారి కుటుంబాలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు.

గత ప్రభుత్వంలో ఇచ్చిన చంద్రన్న బీమా నిలిపివేయడంతో మీ ఆరోగ్య సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది.భవన నిర్మాణ కార్మికులు, కార్మికులు, ట్రక్కు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నారు.

5 ఏళ్లలో వైసీపీ హయాంలో దాదాపు 13,500 మంది రోజువారీ కార్మికులు కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెప్తోంది. 2020 నంబర్ 3న నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అధికారుల వేధింపులు తట్టుకోలేక తన భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.

గత సంవత్సరం రాజమహేంద్రవరంలో మన ఆరుగురు అక్కాచెల్లెళ్లు యాక్సిడెంట్‌లో చనిపోయారు. వాళ్ళు ఆ రోజు పనికి వెళ్లేందుకు బయటికి వచ్చారు, మిగతా వారిలాగే, తమ రోజు కూలీ సంపాదించి తమ ఇంటికి తిరిగి రావాలనే ఆశతో బయలుదేరారు. కానీ అలా జరగలేదు. పదే పదే, ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదు అనిపించేలా చేస్తోంది. కానీ నేను చెప్తున్నాను, మీ జీవితాలు ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి.

మీ కష్టాలు ఇంకా కొంత కాలమే…రానున్న కాలంలో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే…మీ కష్టాలు తీర్చేది కూడా మన ప్రభుత్వమే.. పేదవారి కష్టాలు తీర్చడానికి చంద్రబాబు అనేక పథకాలు తీసుకురాబోతున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రన్న భీమా అందించేవారు. ప్రస్తుతం సిలికా గనుల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నుంచి మద్దతు లేదు.

ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలోని మహిళా కార్మికులు తమ యజమానుల నుండి తగిన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ గనులు, కంపెనీల్లోని మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వ కార్డులు లేవు. తగిన భద్రతా చర్యలు లేక మహిళా కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ రోజు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మీ కష్టాలను, బాధలను, ఆశలను అర్థం చేసుకోగలను. టీడీపీ పాలనలో అన్న క్యాంటీన్ల ద్వారా ఒక్క ఏడాదిలోనే 7.5కోట్ల మంది భోజనం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. మంగళగిరిలో లోకేష్ 5 అన్న క్యాంటన్లు, కుప్పంలో చంద్రబాబు 5క్యాంటీన్లు పెట్టి పేదవారి ఆకలి తీరుస్తున్నారు.

తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు అనేకమంది అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారి ఆకలి తీరుస్తున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.5 కోట్ల మంది కార్మికుల జీవితాలకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలన్న సదుద్దేశ్యంతో చంద్రన్న భీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో రూ.2,400 కోట్లు ఖర్చు చేసి 2 లక్షల కంటే ఎక్కువ మందికి అండగా నిలిచారు.

ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన జీవితాన్ని, ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి అందించాలన్నదే ఆయన ఆశయం. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కార్మిక సంస్కరణలు బాబు గారి ప్రధాన అజెండాగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి కార్మికుడికి నివసించడానికి ఇల్లుతో పాటు మెరుగైన జీవితం, ఆరోగ్యం, పిల్లలకు విద్య అందుబాటులో ఉంటాయి.

అంతేకాదు మహిళల కోసం టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ లో భాగంగా 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలకి నెలకు రూ.1,500 ఇస్తారు.స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్ధికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తారు. మీకు ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45,000 ఇస్తారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు, ఇది మీరు పనికి వెళ్లడానికి, తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళినపుడు ఉపయోగపడుతుంది. ఇవి కేవలం మేనిఫెస్టో హామీలు మాత్రమే కాదు, మహిళల గౌరవం పెంచే, వారికి సాధికారత కల్పించే మార్గం. మీ బాధలు అన్నింటిని మరచిపొండి. మరి కొన్ని రోజుల్లో మీ కష్టాలను తీర్చే ప్రభుత్వం వస్తుంది.

ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి..పదిమందిని ప్రోత్సహించి ఓట్లు వేసేలా చూడాలి. గతంలో నా భర్త మాకు సమయం కేటాయించడంలేదని బాధ పడేవాళ్లం…కానీ నేడు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి మీకోసం, మీ భవిష్యత్తుకోసం చంద్రబాబు 365 రోజులు కష్టపడాలని కోరుకుంటున్నాను

 

Leave a Reply