మీరు చింపింది నాబట్టలుకాదు… ప్రజాస్వామ్యం బట్టలు

• ముఖ్యమంత్రి మెప్పుకోసం నన్ను టార్గెట్ చేసి, అవమానిస్తున్న పోలీసులంతా ఏదో ఒక రోజు పశ్చాత్తాప్పడక తప్పదు.
• నాపై 31 తప్పుడుకేసులు పెట్టారు. ఒక్కదానిలో అయినా నాతప్పు ఉన్నట్టు రుజువుచేశారా?
• పోలీసులు పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం వేస్తున్నారు : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
• డీజీపీ వైసీపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి
– మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్

తనపుట్టినరోజు సందర్భంగా ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీసులు అడ్డుకోవడం, అసందర్భంగా, అకారణంగా స్థానిక డీఎస్పీ నన్నుదూషించి, బలవంతంగా వ్యాన్ లోకి నెట్టి, మాజీప్రజాప్రతినిధిని అయిన నా చొక్కాచించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని టీడీపీ నేత, మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే..

“ఈ ప్రభుత్వ చేతగానితనం, వైసీపీనేతల అహంకారమే నాకు జరిగిన అవమానానికి కార ణం. పాలకులకు ఊడిగంచేసే కొందరు పోలీస్ అధికారుల తీరు, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగులుతుంది. నా బట్టలు చింపారని వైసీపీవారు ఆనందించవచ్చు. కానీ మీరు చింపుతున్నది ప్రజాస్వామ్యం బట్టలని తెలుసుకోండి. కళ్లుండిచూడలేని కబోదిలా వ్యవహరి స్తున్న ముఖ్యమంత్రికి ఎంతచెప్పినా ఉపయోగంలేదు.

నాకు జరిగిన అవమానంపై డీజీపీ సమాధానం చెప్పాలి
ఏ కారణంతో ఏలూరు డీఎస్సీ నాబట్టలు చింపాడు? నా పుట్టినరోజు సందర్భంగా నా అభిమా నులు, మాపార్టీ వారు రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని చూడటానికి వెళ్లడమే నేనుచేసిన నేరమా? స్థానిక ఆసుపత్రిలో సీనియర్ నేత, మాజీఎంపీ హరిరామజోగయ్య గారు చికిత్స పొందుతున్నారని నన్ను అడ్డుకున్నామంటున్నారు. ఒకవేళ ఆయన్ని పరామర్శించడానికి మాత్రం
తానువెళ్తే తప్పేంటి? అప్పటికీ నేను ఒక్కడి నే లోపలికివెళ్లి, రక్తదానశిబిరం ఏర్పాటుచేసిన మావాళ్లను పలకరించి వస్తానన్నా పోలీసులు వినలేదు. ఆసుపత్రిలో రక్తదానశిబిరం ఏర్పాటుచేశారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. మీకు ఊడిగంచేస్తున్న పోలీసులతో ఇలాంటి దారుణాలు ఎన్నాళ్లుచేయిస్తారో చూస్తాం. నాబట్టలు చించామని జబ్బలు చరుచుకుంటున్న వారంతా ఏదో ఒకరోజు బాధ పడక తప్పదు. ప్రజలసొమ్ముని జీతంగా తీసుకుంటున్న పోలీసులు ప్రజా ప్రతినిధుల్ని, ప్రజ ల్ని అవమానిస్తారా? జరిగిన ఘటనపై దర్యాప్తుచేయించి, మా తప్పుంటే చర్యలు తీసుకోండి, మా తప్పుంటే మమ్మల్ని రిమాండ్ చేయండి. నాపై ఇప్పటివరకు 31 తప్పుడు కేసులు పెట్టారు. నాకు జరిగిన అవమానంపై డీజీపీ సమాధానం చెప్పాల్సిందే.

ప్రభుత్వ చేతగానితనాన్ని, ముఖ్యమంత్రి అసమర్థతను ఎత్తిచూపుతున్నాననే నన్ను టార్గెట్ చేస్తున్నారు
అధికారమున్నా… లేకున్నా టీడీపీ ఎప్పుడూ ప్రజలపక్షమే. నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాను.. వారికోసమే పనిచేస్తాను. ఆ క్రమంలో ప్రభుత్వవైఫల్యాలను, అసమర్థ ముఖ్యమంత్రి చేతగానితనాన్ని ఎత్తిచూపుతున్నాననే జగన్ అండ్ కో నన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఓవరాక్షన్ చేసే ప్రతి అధికారి, విధినిర్వహణ, వృత్తిధర్మాన్ని పక్కనపెట్టి పేట్రేగేవారి కి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చితీరుతాం. రాజకీయాలు చేయాలనుకుంటే, ప్రతిపక్షనేతల్ని వేధించాలనుకుంటే పోలీసులు ఖాకీ తీసేసి, వైసీపీచొక్కాలు వేసుకోవాలి. ఐపీసీ చట్టం పోలీ సులకు యూనిఫామ్ ఇచ్చింది, ప్రజాప్రతినిధులు చొక్కాలు చించడానికా? న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన ఖాకీలు, ఇలా సిగ్గు,శరంలేకుండా ప్రవర్తిస్తారా? తనకు మంది బలం ఉందని స్థానిక డీఎస్పీ నాచొక్కా చింపి, వీరంగంవేశాడు. బలం మాకులేదా.. రేపు రమ్మనం డి.. చూద్దాం. ఈరోజు నాబట్టలు చింపిన డీఎస్పీకి, రేపు బట్టలు ఉంటాయా? జోగయ్యగారిని పరామర్శించడానికి నేను వెళ్లకూడదా? డీఎస్పీ తప్పులు మాకుతెలియవా? డీఎస్పీ తప్పుచేయలేదా? ఎవరిడబ్బుతో ఆశ్రమ్ ఆసుపత్రి కట్టారు? డీఎస్పీ జీతమెంత.. ఆసొమ్ము తోనే ఆసుపత్రి కట్టాడా? ఆయన తనసొంత సొమ్ముతోనే తనకూతుర్ని ఎంబీబీఎస్ చదివిస్తు న్నాడా? తప్పులు జరిగితే సర్దిచెప్పాలి. బాధ్యతగా హుందాగా వ్యవహరించాలి.

అన్నం తినేవాడు ఎవడూ ఇలాచేయడు
పోలీసులు కావాలనే నన్ను అడ్డుకున్నారు. గతంలో ఎన్నోసార్లు ముందస్తుఅరెస్ట్ లు చేశారు . కానీ ఏనాడూ ఇలా హద్దులుమీరి ప్రవర్తించలేదు. అన్నంతినేవాడు ఎవడూ ఇలా ప్రవర్తించ డు, గడ్డితినేవాళ్లే ఇలాచేస్తారు. నా బట్టలు చింపితే నేను భయపడతాను అనుకుంటున్నారే మో! నేనుకాదు, నావెంట్రుక కూడా భయపడదు. గతంలో కూడా నన్నుచంపడానికి నర్సీపట్నం ఫారెస్ట్ లోకి తీసుకెళ్లారు. అప్పుడు నాతో వచ్చిన పోలీసులు చాలాకాలం తర్వాత ఎన్ కౌంటర్ చూస్తున్నామని అనలేదా? స్థానికంగా పెట్రోల్ బంక్ లో డబ్బాల్లో పెట్రో ల్ కొట్టించలేదా? స్థానిక అడిషనల్ ఎస్పీ నాకు, గంజాయి ముఠాలకు లింకు పెట్టడానికి చూశారు. నాపై 16వరకు ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు. నాపై పెట్టిన 31 కేసుల్లో ఒక్కదానిలో అయినా నన్ను నేరస్తుడిగా రుజువు చేయగలరా? నాకేమీ వెధవవ్యాపారాలు లేవు, దుర్మార్గ పు ఆలోచనలు చేసే మనిషినికాను. నన్ను అణగదొక్కడానికి, భయపెట్టడానికే ఉద్దేశపూర్వ కంగా జైలుకుపంపారు.

నేనేమీ నీకులాగా అవినీతిచేసి, జైలుకెళ్లలేదు
కానీ నువ్వు తప్పుచేసి, అవినీతి చేసి జైలుకు వెళ్లావు. మాపార్టీ కార్యకర్తల్ని భయపెడుతు న్నావు. కోడెల లాంటి మహానుభావుడినే భూమ్మీద లేకుండా చేశావు. కొన్నివందలమంది మహిళల తాళిబొట్లు తెంచావు. ఇదేనా నీ పరిపాలన? ఎన్నాళ్లు ఉంటారు మీరు అధికారం లో? ఒక్కసారి.. ఒక్కసారి అంటే, ఆ ఒక్కసారి ఎంత ప్రమాదకరమైందో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. స్థానిక ఏలూరు డీఎస్పీ ఒక్కడే నాపై ఓవరాక్షన్ చేశాడు. ఇదిగో చింతమనేని లాంటి వ్యక్తిని ఇలాచేశాను అనిచెప్పుకోవడానికే నన్ను అవమానించి, నా చొక్కా చించాడు. ఆ డీఎస్పీ నాపై తప్పుడుకేసులు పెట్టినా, నాకు న్యాయంచేయడానికి న్యాయస్థానం ఉంది. రేపు నా పుట్టినరోజు వేడుకలు ఈ పోలీసులు, ప్రభుత్వం అడ్డుకున్నా ఏమీ భయపడను. అవసరమైతే జైల్లోనే తోటిమిత్రులతో పుట్టినరోజు చేసుకుంటాను. నాప్రమేయం లేని చాలా ఘటనలకు నన్ను బాధ్యుణ్ణి చేశారు. ఆయా ఘటనల్లో మీడియాప్రమేయం కూడా ఉంది.

పెళ్లికి, తద్దినానికి పోలీసులు ఒకే మంత్రం వేస్తున్నారు : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య
వైసీపీనేతల మెప్పు పొందడానికే డీఎస్పీ సత్యనారాయణ, మా నాయకుడు ప్రభాకర్ ని అవమానించారు. ప్రభాకర్ అభిమానులు నిర్వహించే రక్తదాన శిబిరం వద్దకు ఆయన వెళ్లకూడదా? పోలీసులు బుద్ధి, జ్ఞానంఉండే ఇలాంటివి చేస్తున్నారా? రేపు తాము అధికారంలోకి వచ్చాక, సత్యనారాయణ లాంటి పోలీస్ అధికారులు తగినమూల్యం చెల్లించు కొని తీరతారు. పోలీసులు పెళ్లికి, తద్దినానికి ఒకేమంత్రం వేస్తున్నారు. జరిగినఘటన పై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదుచేస్తాం. దురదృష్టం ఏమిటంటే తాముఎప్పుడు వెళ్లినా, డీజీపీ కార్యాలయ తలుపులు తెరుచు కోలేదు.

డీజీపీ వైసీపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారు : గోరంట్ల బుచ్చయ్యచౌదరి
ప్రతిపక్షనేతల గొంతునొక్కడానికే, శాడిస్ట్ ముఖ్యమంత్రి ఇలాంటి దారుణాలు చేయిస్తున్నాడు . తెలుగుదేశం ప్రభుత్వంలో విప్ గా పనిచేసిన చింతమనేని ప్రభాకర్ కు జరిగిన అవమానం పై పాలకులు ప్రజాకోర్టులో సమాధానంచెప్పక తప్పదు. పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నారు. కొందరు కరుడుగట్టిన పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి మెప్పుకోసం పనిచేస్తున్నారు. మాజీఎంపీ హరిరామజోగయ్య ఒక సదుద్దేశంతో, తనజాతి కోసం పోరాడుతుంటే ఆయన్ని అరెస్ట్ చేస్తారా? 84 ఏళ్ల వృద్ధుడిని చూసి కూడా ఈ ప్రభు త్వం ఉచ్చపోసుకుంటోంది. రాష్ట్రంలో జరిగే నేరాలు-ఘోరాలపై డీజీపీ చిలుకపలుకులు పలు కుతుంటాడు.

వైసీపీ ఏజెంట్ లా డీజీపీ వ్యవహరిస్తున్నారు. దోషుల్ని నిర్దోషులుగా, నిర్దోషు ల్ని దోషులుగా చూపే సంస్కృతి ఈరాష్ట్రంలోనే చూస్తున్నాం. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ ను అడ్డాగా మార్చారు. పోలీసులు ఇప్పటికైనా తప్పుడు విధానాలుమాని, కళ్లుతెరిస్తే మంచిది, తప్పుచేసే పోలీస్ అధికారుల్ని సమర్థించే పోలీస్ సంఘం జరిగిన ఘటనపై ఏంసమాధానం చెబుతుంది? పల్నాడు, రాయలసీమలో ఇళ్లమీద పడి దాడులు, ఆస్తులు ధ్వంసంచేసే వైసీపీవారిని ఏంచేస్తున్నారు?

ఏవో కొన్నికులాలు, పార్టీలు, అనుబంధసంఘాల నేతలపై కక్షతో వ్యవహరించడంకాదు. మాజీముఖ్యమంత్రి ఇంటిపై దాడిచేసినవారిని, ప్రతిపక్షపార్టీ కార్యాలయంపై దాడిచేసినవారిని ఏంచేశారు? దిశా చట్టం లేకుండా తెచ్చిన ఉత్తుత్తి యాప్ మహిళల్ని రక్షిస్తోందా? పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్లే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ గా మారింది.

Leave a Reply