అంతమందిని పొట్టనపెట్టుకున్న జగన్‌రెడ్డిపై అప్పుడెందుకు కేసులు పెట్టలేదు?

• తన చేతగానితనం, అసమర్థత, నిర్లక్ష్యంతో వందలమందిని బలితీసుకున్న జగన్ రెడ్డిని వదిలేసి, పేదలకు సేవచేసే వారిని తప్పుడుకేసులతో వేధిస్తారా?
• అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి 39 మంది చనిపోయినప్పుడు, ఈ పోలీసులు జగన్ రెడ్డిపై ఎందుకు కేసునమోదు చేయలేదు?
• కచ్చులూరు బోటుప్రమాదంలో 55 మంది,ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 13మంది చనిపోతే, ఈ ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంది?
• జంగారెడ్డిగూడెంలో జగన్ రెడ్డి కల్తీసారా కాటుకి 27మంది బలైతే, రుయా ఆసుపత్రిలో 36మంది మరణిస్తే, ఈ ముఖ్యమంత్రిపై పోలీసులు ఏంచర్యలు తీసుకున్నారు?
• ప్రజలకు మంచిచేయడం చేతగాని జగన్ రెడ్డి, చేసేవారిని తనకక్షసాధింపులకు బలిచేయడం దుర్మార్గం
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్

అమ్మపెట్టదు…అడుక్కుతిననివ్వదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తనకుట్రరాజకీయాలు చేస్తున్నాడని, ఆక్రమంలోనే ప్రభుత్వవైఫల్యంతో జరిగిన నిన్నటి గుంటూరు ఘటనను రాజకీయం చేస్తూ, పేదలకు సాయం చేయడానికి ముందుకొచ్చే చేతుల్ని నరికేస్తున్నాడని, టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనస భ్యులు కూనరవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“చంద్రబాబుప్రభుత్వం గతంలో పేదలను సంతోషంగా ఉంచడంకోసం అమలుచేసిన క్రిస్మస్ కానుక, సంక్రాంతికానుక, రంజాన్ తోఫా వంటిపథకాలను, కక్షతో జగన్ రెడ్డి నిలిపివే యకుంటే, గుంటూరులో నిన్న ముగ్గురుపేదలు మరణించేవారుకాదు. ప్రజలకు మంచి చేయడం జగన్ రెడ్డికి ఎలాగు చేతగాదు. ముఖ్యమంత్రిస్థానంలో ఉండి పేదలకు సాయంచేసే వారిని అడ్డుకోవడం, పేదలప్రాణాలు తీసేందుకు కుట్రలు పన్నడం దుర్మార్గం కాదా?

పోలీస్ మాన్యువల్ ప్రకారమే గుంటూరులో పోలీసులు భద్రతాఏర్పాట్లు చేశారా?
30వేల మంది పేదలకు కొత్తసంవత్సరంలో సాయం చేయాలనుకోవడమే ఎన్ ఆర్ ఐ ఉయ్యూరి శ్రీనివాసరావు చేసిన నేరమా? ఆయన తన ఫౌండేషన్ ద్వారా ఎప్పటినుంచో సే వా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను చేపట్టబోయే కార్యక్రమానికి శ్రీనివాసరావు ముం దే పోలీసుల అనుమతి తీసుకున్నారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించి, ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలని కూడా శ్రీనివాసరావు పోలీసుల్ని కోరారు. పోలీసులు సరైన భద్రత కల్పించనందునే నిన్న గుంటూరులో అమాయకులు బలయ్యారు.

ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు, సభలు, సమావేశాల్లో మందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పోలీస్ మాన్యువల్ లో ఉందికదా! పోలీస్ మాన్యువల్ లోని 304-2 నిబంధన ప్రకారం అలాంటి ప్రాంతాలు, ప్రదేశాలను కొన్నిబ్లాక్ లు, సెక్టార్లుగా విభజించి, ఒక్కో సెక్టార్, బ్లాక్ కి ఇన్ ఛార్జ్ లుగా కొందరు పోలీస్ అధికారుల్ని నియమించి, అతనిపేరు, హోదాను వెల్లడించాలన్న నియమాన్ని పోలీసులు విస్మరించారా? పోలీస్ మాన్యువల్ నిబంధన 304-10 ప్రకారం ఏఎస్ఐ, లేదా హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారిని ప్రతి 5 లేదా 10మందికి ఇన్ ఛార్జ్ గా ఉండాలన్న నిబంధన అమలుచేశారా? నిన్నగుంటూరులో జరిగిన కార్యక్రమం లో పోలీసులు ఈ నిబంధనలన్నీ అమలుచేశారా? చేస్తే అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

గుంటూరు ఘటనకు శ్రీనివాసరావుని భాధ్యుణ్ణిచేసిన పోలీసులకు, జగన్ రెడ్డి నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణాలు, పోయినప్రాణాలు కనిపించలేదా?
గుంటూరు దుర్ఘటనకు శ్రీనివాసరావుని బాధ్యుణ్ణి చేస్తూ పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గం. శ్రీనివాసరావు అరెస్ట్ ప్రభుత్వ కక్షసాధింపు, నిరంకుశత్వానికి సంకేతం. పేదలకు కానుకలు పంచడానికి చంద్రబాబుని ఆహ్వానించాడన్న అక్కసుతోనే ప్రభుత్వం అతనిపై కేసులుపెట్టి వేధిస్తోంది. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 39 మంది చనిపోయినప్పుడు, ఈ పోలీసులు జగన్ రెడ్డిపై ఎందుకు కేసునమోదు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి అవినీతివల్లే అన్నమయ్యప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయింది నిజంకాదా? కచ్చులూరు బోటుప్రమాదంలో 55 మంది చనిపోతే, ఈ ముఖ్యమంత్రి ఏంచేశాడు? సదరు ఘటనకు సంబంధించిన శాఖా మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 13మంది చనిపోతే, ఈ ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంది? జగన్ రెడ్డి అసమర్థత, అత్యాశవల్ల జంగారెడ్డి గూడెంలో సంభవించిన 26 కల్తీసారా మరణాలపై పోలీస్ శాఖ ఏంచర్యలు తీసుకుంది? రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 36మంది బలైతే, ఈ ప్రభుత్వాధినేతపై ఎందుకు కేసు నమోదుచేయలేదు? పాలకుల నిర్లక్ష్యం, అసమర్థతవల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 173 మందిచనిపోతే, ముఖ్యమంత్రిపై ఏపీ పోలీస్ శాఖ ఎందుకు కేసునమోదు చేయలేదు? ఏలూరులో కలుషిత నీరుతాగి 600మంది అస్వస్థతకు గురైతే, ఈ ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంది?

శ్రీకాళహస్తిలో జగన్ రెడ్డి సభలో 20మందికి గాయాలైతే, ఈప్రభుత్వం ఆ ఘటనకు ఎవరిని బాధ్యుల్ని చేసింది? క్షతగాత్రులకు ఎలాంటి సాయం చేసింది? గతంలో జగన్ రెడ్డి, ఆయనతల్లి విజయమ్మల సభల్లో వివిధసందర్భాల్లో 45 మందికి గాయాలైతే, ఆనాడు తల్లికొడుకులు ఎవరినీ పరామర్శించింది లేదు. తనకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే, అతని కుటుంబానికి రూ.5లక్షలు ఇస్తానని చెప్పి, కేవలం రూ.2.50లక్షలే ఇచ్చి, చేతులుదులుపుకున్న కర్కోటకుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గతంలో ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒకరుచనిపోయారు. తరువాత అదేయాత్రలో పలుసందర్భాల్లో మొత్తం 8మంది చనిపోతే, జగన్ రెడ్డి మృతుల కుటుంబాల ముఖంకూడా చూడలేదు. జగన్ రెడ్డి కర్కశ మనస్తత్వానికి ఇలాంటి ఘటనలు ఎన్నో రుజువులు. ఇష్టానుసారం ప్రభుత్వధనాన్ని లూఠీచేస్తూ, లెక్కకుమిక్కిలిగా అమయా కుల్ని బలితీసుకుంటున్న ముఖ్యమంత్రిపై కేసులు పెట్టరా? సొంతసొమ్ముతో పేదలకు సేవచేసే వారిపై తప్పుడుకేసులు పెట్టి వేధిస్తారా? ఇలాచేస్తే ఎవరైనా రాష్ట్రంలో పేదలకు సాయం చేస్తారా? ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు విలపిస్తున్నా పట్టించుకునే నాథుడు ఉంటాడా?

గుంటూరు ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వమే బాధ్యత వహించాలి
చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతూ, అవాంతరాలు సృష్టిస్తోంది. కందుకూరు, గుంటూరు దుర్ఘటనలు ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రలో భాగంగా జరిగినవే. చంద్రబాబు సభల్లో జరిగే దుర్ఘటనలు, ఏర్పడే అవాంత రాలన్నీ ప్రభుత్వ సృష్టే అనడానికి కొడాలినానీ వ్యాఖ్యలే నిదర్శనం. పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్రం నీ అబ్బ జాగీరుకాదు నాని. గుంటూరు ఘటనలో జగన్మోహన్ రెడ్డి, ఆయన చేతగాని ప్రభుత్వం కుట్ర ఉంది.
ప్రభుత్వ కుట్రలేకుండే గుంటూరు ఘటనపై ఎలాంటి విచారణకైనా ఈ ప్రభుత్వం సిద్ధమేనా? కందుకూరు, గుంటూరు దుర్ఘటనల వెనుక ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రదాగి ఉంది. జగన్ రెడ్డి ఇదేవిధంగా ఫ్యాక్షన్ మనస్తత్వంతో, నియంత్రత్వ భావజాలంతో వ్యవహరిస్తే, ప్రజలకు సాయంచేయడానికి ఎవరూ ముందుకురారు.” అని రవికుమార్ తేల్చిచెప్పారు.

Leave a Reply