Suryaa.co.in

Andhra Pradesh

శిలాఫలకాల ప్రభుత్వమిది

-మూర్ఖులకు, అహంకారులకు ఓటేయొద్దు…
-రాష్ట్రం మొత్తం మాఫియాగా మారింది
-రైతులను దగా చేశారు…
-ఆలూరులో పనికిరాని వ్యక్తిని మార్చాడట
-నియోజకవర్గం మొత్తం దోపిడీ అంటా
-ఇక్కడ చెత్త…మరోచోట పనికొస్తుందా?
-కార్మిక మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా?
-ఆలూరు ప్రచారంలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి

మూర్ఖులకు, అహంకారులకు ఓటు వెయొద్దని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని, ఆ పార్టీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని హెచ్చరించారు. రాష్ట్ర మంతా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా నడుస్తోందని, ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం ఆలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఇదే ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. కార్మిక శాఖ మంత్రి అంట.. ఇక్కడ చెత్త తీసి వేరే చోటకు పంపాడట. ఈ నియోజక వర్గానికి పనికి రాడని మార్చాడట. ఇక్కడ పనికిరాని వ్యక్తి అక్కడ ఎలా పనికి వస్తాడు? కార్మిక శాఖ మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో మొత్తం దోపిడీ అంట కదా అని అడిగారు.

వేదవతి ప్రాజెక్టు ఏమైంది…
వేదవతి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తా అని జగన్‌ హామీ ఇచ్చాడు. ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2008లో వైఎస్‌ఆర్‌ శిలాఫలకం వేశాడు. అదే ప్రాజెక్టుకు జగన్‌ మరో శిలాఫలకం వేశాడు. ఆయనది శిలాఫలకాల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టు కట్టి ఉంటే 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదన్నారు. నియోజకవర్గంలో టమాటా ఎక్కువ పండుతుంది. రైతుల కోసం ఫడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ అన్నారు..కట్టలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశాడు. రైతును రారాజును చేస్తా అన్నా డు.. ఇప్పుడు రైతులు అప్పుల పాలయ్యారు. ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ మాత్రమేనని, అధికార మిస్తే 2.25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE