Suryaa.co.in

Andhra Pradesh

ఓడినా ప్రజల్లోనే ఉండి సేవ చేస్తున్నా

-పేదరికం లేని మంగళగిరి నా కల
-గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు

-ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు
-యువనేత సమక్షంలో పార్టీలోకి చేరికలు
-మంగళగిరిలో కొనసాగుతున్న వలసల పర్వం!

మంగళగిరి : మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న యువనేత నారా లోకేష్ నినాదంతో నియోజకవర్గంలో వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరికి పట్టణం 16, 19, 20వ వార్డులకు చెందిన 75 కుటుంబాలు, ఆత్మకూరుకు చెందిన 25 కుటుంబాలు టిడిపిలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మంగళగిరి పట్టణానికి చెందిన కొదమల సైమన్ ఆధ్వర్యంలో జొన్నాదుల శివశంకర్, సాయి ప్రసాద్, చిక్కా బాలసూర్య కుమార్, వాకా మాధవ్ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు, బట్టు శివానందశాస్త్రి, చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో దామర్ల శివశంకర్, వీరస్వామితో పాటు 25 కుటుంబాలు, ఆత్మకూరు నుండి పులివర్తి సుందరయ్య ఆధ్వర్యంలో వేమూరి మోహన్, కంభంపాటి చందు, కుపంటి ప్రేమ్ కుమార్, వేమూరి ప్రభుదాస్ తోపాటు 30 కుటుంబాలు శుక్రవారం లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి రూరల్ అధ్యక్షులు తోట పార్ధసారధి, మంగళగిరి పట్టణ, రూరల్ ప్రధాన కార్యదర్శులు రియాజ్, మల్లవరపు వెంకట్, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఓడినా ప్రజల్లోనే ఉండి సేవ చేస్తున్నా
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో నేను 18 రోజుల ముందు మంగళగిరి వచ్చాను. ఓడిపోయినా ప్రజల్లోనూ ఉంటూ సొంత నిధులు వెచ్చించి సేవ చేస్తున్నా. మంగళగిరిలో వరుసగా రెండుసార్లు వైసిపిని గెలిపించినా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. నేను చిరువ్యాపారులకు నాలుగేళ్లుగా తోపుడు బండ్లు ఇస్తుంటే, వారు ఎన్నికల కోసం ఇప్పుడు ఇస్తున్నారు. పాదయాత్ర చేసే సమయంలో కూడా నా మనసు మంగళగిరిలోనే ఉంది.

చంద్రబాబు జయహో బీసీ సభలో హామీ ఇవ్వగానే ఇప్పుడు u1 జోన్ ఎత్తేశారు. ప్రభుత్వభూముల్లో ఇళ్లుకట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది, రెండునెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ పట్టాలు ఇవ్వడమేగాక నియోజకవర్గంలో ఇల్లులేని పేదలకు 20వేల పక్కా ఇళ్లు నిర్మిస్తాం. రెండు సార్లు ప్రజలు ఆర్కేను గెలిపించారు… కానీ ఆయన ఇల్లు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. నేను ఉండవల్లిలోనే ఉంటా, మా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. మన నాయకులు కూడా అందుబాటులో ఉంటారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ నావద్ద ఉంది. ఈ సారి నాకు అవకాశం ఇవ్వండి.

మీ రుణం తీర్చుకుంటానని లోకేష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. బులుగు బటన్ నొక్కి 10రూపాయలు ఎకౌంట్లలో వేసి ఎర్ర బటన్ తో వంద కొట్టేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలపై భారం పడకూడదన్న ఉద్దేశంతో ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, జగన్ అధికారంలోకి వచ్చాక 9సార్లు పెంచి రూ.50వేలకోట్లకు పైగా భారం మోపారని లోకేష్ అన్నారు.

LEAVE A RESPONSE