యర్రగొండపాలెం అభివృద్ధి బాధ్యత నాది

-ఎరిక్షన్ ని గెలిపించండి
-టీడీపీలో చేరిన యర్రగొండపాలెం వైసీపీ నేతలు
-పసుపు కండువాకప్పి ఆహ్వానించిన నారా లోకేష్

అమరావతి :- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు పలువురు వైసిపికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఉండవల్లి నివాసం వద్దకు రాగా, వారందరికీ యువనేత లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరేవారందరికీ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ అన్నారు.

యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబును మంచి మెజారిటీతో గెలిపించి తమవద్దకు తీసుకురావాలని, నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. పార్టీలో చేరినవారిలో పుల్లల చెరువు మండల పార్టీ కన్వీనర్ బోగులు వెంకటసుబ్బారెడ్డి, సర్పంచులు చిన్నపురెడ్డి రమణారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మాగులూరి సామేలు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బోళ్ల పోలిరెడ్డి తదితరులు పార్టీలో చేరారు.

Leave a Reply