హత్య అందరికంటే ముందు జగన్-భారతికి తెలుసు

– హత్య ఉదయం జరిగితే జగన్ సాయంత్రానికి ఎందుకొచ్చారు?
– హంతకులను జగనే కాపాడుతున్నారు
– అవినాష్-భాస్కరరెడ్డిని రక్షిస్తున్నది జగనే
– మా ఇంట్లోనే శత్రువులున్నారు
– కూల్చడంతో పాలన ప్రారంభించిన జగన్ కు పాలించే హక్కులేదు
– మంచి పాలకుడు రాష్ట్రానికి రావాలి
– నా రాజకీయ అరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుంది
– వివేకా భార్య సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కారణాలతో నా భర్తను హత్య చేశారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి పులివెందులలో ఫ్యాక్షన్ ను రూపుమాపారు. అలాంటిది ఐదేళ్ల కిందట మా ఇంట్లో ఇంత ఘోరం జరిగింది. మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారని ఊహించలేదు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నట్లు అనుమానాలున్నాయి. జగన్ కు అధికారముందని అవినాష్, భాస్కర్ రెడ్డిని రక్షిస్తున్నారు.

2019 మార్చి 15న ఉదయం హత్య జరిగితే.. జగన్ సాయంత్రానికి వచ్చారు .జగన్ ఆలస్యంగా రావడంలోనే అనుమానాలు ఉన్నాయి. హత్య విషయం అందరికంటే ముందు జగన్, భారతికి తెలుసని అనిపిస్తోంది . హత్యకేసులో న్యాయం కావాలని కుటుంబమంతా వెళ్లి జగన్ ను అడిగాం. సునీత పిటిషన్ వేసే చివరిక్షణంలోనూ జగన్ కు సమాచారమిచ్చినా స్పందించలేదు.

సునీత ఒంటరిగా న్యాయపోరాటం చేస్తుంటే ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది.హంతకులకు శిక్ష పడుతుంది. కూల్చడంతో పాలన ప్రారంభించిన జగన్ కు పాలించే హక్కులేదు. మంచి పాలకుడు రాష్ట్రానికి రావాలని ఆకాంక్షిస్తున్నా. జగన్ పార్టీకి ఓటేయొద్దనే సునీత మాటలతో ఏకీభవిస్తున్నా. నా రాజకీయ అరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

Leave a Reply