Suryaa.co.in

Telangana

కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఈడీ

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ . ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లకు కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత గత పదేళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్ ఆమె నివాసం వద్దకు వచ్చినప్పటికీ… వారిని ఈడీ అధికారులు అనుమతించలేదు.

ఈ క్రమంలో కవితకు అరెస్ట్ వారెంట్ వారెంట్ ఇచ్చిన ఈడీ అధికారులు… ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై కాసేపట్లో ఈడీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే… ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.

కాగా ఈడీ అధికారులు ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ యాక్ట్ ద్వారా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం. 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

“ఎంఎల్‌సీ కవిత.. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం -2002 కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు నా వద్ద కారణాలు ఉన్నాయని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జోగేందర్ అనే నేను తెలియజేస్తున్నాను. మనీల్యాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19లోని సబ్ సెక్షన్(1) కింద నాకు ఉన్న అధికారాల మేరకు ఎంఎల్‌సీ కవితను అరెస్ట్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశాం. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశాం.” అని నోటీసులో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE